Monday, April 29, 2024
- Advertisement -

రుచికరమైన బంగాళదుంప హల్వా ఎలా తయారు చేయాలంటే?

- Advertisement -

సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు హల్వా తినాలంటే ఎంతో ఇష్టపడుతుంటారు. హల్వా అంటే కేవలం క్యారెట్ తో మాత్రమే కాకుండా బంగాళదుంప తో తయారు చేసుకున్న హల్వా కూడా ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.మరి ఈ బంగాళదుంప హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:
మైదా పిండి ఒక కప్పు, బంగాళదుంపలు 5, చిక్కటి పాలు ఒక కప్పు, నెయ్యి అర కప్పు, చక్కెర పొడి ఒకటిన్నర కప్పు, జీడిపప్పు బాదం గుప్పెడు, ఏలకులపొడి ఒక టీస్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు
(అవసరమనుకుంటే)

*ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి వాటిపై ఉన్న తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.

Also read:రుచికరమైన టమోటో రైస్ ఎలా తయారు చేయాలో తెలుసా?


*తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఈ బంగాళా దుంప ముక్కలను వేసి చిన్న మంటపై బాగా వేయించాలి. బంగాళాదుంప ముక్కలు ఎంత మగ్గితే హల్వా అంత రుచిగా వస్తుంది.

*బంగాళదుంపలు బాగా మగ్గిన తర్వాత అందులో కి పాలు పంచదార వేసి బాగా కలియబెట్టాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మెత్తగా ఉడికించుకోవాలి.

Also read:ఆంధ్ర స్పెషల్.. టమోటా పప్పు ఎలా చెయ్యాలంటే?

*ఈ మిశ్రమం బాగా ఉడికిన తరువాత మిశ్రమం మొత్తం దగ్గర పడుతూ ముద్దగా తయారవుతుంది.ఈ మిశ్రమంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడి పప్పు, బాదం , అదేవిధంగా ఏలకులపొడి వేసి కలియబెట్టి స్టౌ ఆఫ్ చేయాలి.

*వేడి వేడిగా ఉన్న హల్వాను సర్వర్ చేసుకుని తినటం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -