భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

- Advertisement -

సాధారణంగా మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే అధిక శరీర బరువు పెరగకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అన్నం తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయడం, పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆహార నియమాలను పాటించడం వంటివి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే చాలామందికి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని భావిస్తుంటారు. అయితే భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేసే వారు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి.. భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయడం వల్ల మనం తీసుకునే ఆహారంలో పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ పూర్తిగా విఫలం అవుతుంది. కనుక భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయకూడదు.

- Advertisement -

Also read:జవాన్స్ తో డ్యాన్స్ వేసిన అక్షయ్ కుమార్..?

భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి వాకింగ్ చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమై అందులోని పోషకాలు మన రక్తంలోనికి చేరుతాయి. అదేవిధంగా చాలామంది భోజనం చేసిన వెంటనే నిద్ర పోతారు. ఈ విధంగా నిద్రపోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు తలెత్తడంతో పాటు, గొంతులో మంట ఏర్పడటం జరుగుతుంది. కనుక భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. మనం నిద్ర పోయే సమయానికి ఒక గంట ముందు భోజనం చేయడం ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

Also read:ప్రియమణికి ఆ కోరిక ఉందట.. మరి అలా మెప్పిస్తుందా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -