Saturday, April 27, 2024
- Advertisement -

వంశీ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ స్ట్రైట్ సినిమా?

- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళంలో నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో హీరో విజయ్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా విజయ్ తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ స్ట్రైట్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు జోరుగా వినబడుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వంశీ పైడిపల్లి దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అయితే కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలియజేస్తామని తెలిపారు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

Also read:నటుడు సోనుసూద్ కి నోటీసులు జారీ చేసిన ముంబై హైకోర్టు?

ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో వంశీ బిజీగా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం విజయ్ తన 65 వ సినిమాతో బిజీగా గడుపుతున్నారు. విజయ్ ఈ సినిమా పూర్తి అయిన వెంటనే వంశీ దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం. ఇదివరకే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్, మహేష్ బాబు హీరోలుగా సినిమా చేయాలని ప్రయత్నించినప్పటికీ ఆ హీరోలిద్దరూ బిజీగా ఉండటంవల్ల వారితో సినిమా కుదరలేదు.ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ స్ట్రైట్ సినిమా చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also read:ఆది పురుష్ చిత్రంలోని కీలక పాత్ర పై స్పందించిన బిగ్ బాస్ విన్నర్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -