Tuesday, May 21, 2024
- Advertisement -

బాబు విడుదల సరే..నెక్ట్స్ టార్గెట్ లోకేషేనా?

- Advertisement -

అవినీతి కేసుల్లో సెప్టెంబర్ 11న అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్‌ నెల రోజులు దాటింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే చంద్రబాబుకు బెయిల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ జరుగుతున్న పరిణామాలతో చంద్రబాబుకు బెయిల్ వస్తుందని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు.

అయితే చంద్రబాబు విడుదల సంగతి అలా ఉంచితే నెక్ట్స్ టార్గెట్ చినబాబు లోకేషేనని తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో ఏ 14గా ఉన్నారు లోకేష్. రెండు రోజుల పాటు లోకేష్‌ని విచారించారు సీఐడీ అధికారులు. ప్రధానంగా హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూరేలా వ్యవరించారని ఆరోపణలు రావడంతో ఇదే అంశానికి సంబంధించిన ప్రశ్నలను అడిగారు.

గత కొన్ని రోజులుగా లోకేశ్ జైలుపాలు అవుతాడని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇక సీఐడీ అధికారులు లోకేష్‌ని విచారిస్తున్న తీరును గమనిస్తే ఆయన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఎందుకంటే లోకేష్‌ బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీఐడీ భావిస్తోంది. ఇదే విషయాన్ని న్యాయస్ధానానికి తెలిపి లోకేష్‌ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారే ఛాన్స్ లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో టీడీపీ స్కామ్ లు, సరిగ్గా ఎన్నికల ముందే బయటకు రావడం, చంద్రబాబు రిమాండ్ తర్వాత లోకేష్ కూడా అరెస్ట్ అవడం ఖాయమని తెలుస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -