Friday, May 17, 2024
- Advertisement -

లోకేష్ ఢిల్లీకి వెళ్లింది దేనికీ?చేస్తుందేంటీ?

- Advertisement -

ఒక్క ములాఖత్ వారి రాజకీయ భవిష్యత్‌ని నిర్ణయించింది..? ఒకే ఒక్క ములాఖత్ పొత్తు పొడిచేలా చేసింది…?ఆ రెండు పార్టీల్లోని నేతల్లో ధైర్యం నింపింది..?ఇంతకీ ములాఖత్ ఏంటీ…?ఏం జరిగింది అనుకుంటున్నారా..?అదే అవినీతి కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు కథ. జనసేన అధినేత పవన్, టీడీపీ నేతలు లోకేష్, బాలకృష్ణతో చంద్రబాబు 40 నిమిషాల పాటు ములాఖత్ అయ్యారు. ఈ ములాఖత్‌లో రెండు పార్టీల పొత్తు, లోకేష్ ఢిల్లీ పయనం,రాజకీయ వ్యూహాలపై చర్చించారు.

అంతే జెట్ స్పీడ్‌తో టీడీపీ – జనసేన పొత్తు అనౌన్స్‌మెంట్ అదే రోజు లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటివరకు అంతాబాగానే ఉన్నా లోకేష్ ఢిల్లీ వెళ్లింది కేంద్ర పెద్దలను కలిసేందుకు. అలాగే టీడీపీ – బీజేపీ పొత్తు గురించి చర్చించేందుకు. ఇందుకోసం కేంద్రహోమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా అడగ్గా షా కార్యాలయం సానుకూలంగా స్పందించింది. ఇందుకు పవన్ కూడా హెల్ప్ చేశారు.

కానీ ఢిల్లీ వెళ్లిన లోకేష్ పూర్తిగా సైడ్ ట్రాక్ అయ్యారు. అసలు విషయం మర్చిపోయి మీడియా వెంట పడ్డారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. చంద్రబాబుకు స్కామ్ తో ఎలాంటి సంబంధంలేదని నేషనల్ మీడియా ద్వారా చెబుతున్నారు. కానీ ఇక్కడే రాంగ్ స్టెప్పు వేస్తున్నారు లోకేష్. ఎందుకంటే లోకేష్ మీడియా ఇంటర్వ్యూల వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండే అవకాశం లేదు. ఈనేపథ్యంలో ఆయన ఏం ఆశించి మీడియాలో ఉండేందుకు ఆసక్తిచూపుతున్నారో అర్ధం కావడం లేదని టీడీపీ నేతలే చెబుతున్న పరిస్థితి. ఢిలీలోని ఛానళ్ళ చుట్టు తిరుగుతు టైం వేస్టు చేసేబదులు కేంద్ర పెద్దలను కలిస్తే ఉపయోగం ఉంటుందని పలువురు నేతలు చెబుతున్న లోకేష్ చెవికెక్కడం లేదట. ఏదిఏమైనా లోకేష్ హస్తిన పర్యటన బాబును బయటకు తీసుకొచ్చే సంగతి పక్కన పెడితే ఆయనకు మరిన్ని ఇబ్బందులు తెచ్చేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -