Friday, May 17, 2024
- Advertisement -

లోకేష్ పాదయాత్రకు బ్రేక్‌..బ్రహ్మాణి వంతు వచ్చేసింది!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. చంద్రబాబును జైలు నుండి బయటకు తీసుకురావడానికి టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ వైపు బాబును బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు పార్టీని ప్రజాక్షేత్రంలో ముందుకు తీసుకెళ్లేందుకు నందమూరి, నారా కుటుంబాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గతంలో జగన్ అనుసరించిన స్ట్రాటజీనే ఫాలో కావాలని నారా ఫ్యామిలీ డైసైడ్ అయినట్లు తెలుస్తోంది. జగన్ 16 నెలలు జైలులో ఉన్న సమయంలో పాదయాత్ర ద్వారా వైఎస్‌ఆర్‌సీపీని కాపాడుకునే ప్రయత్నం చేశారు విజయమ్మ, షర్మిల. ఇప్పుడు సేమ్‌ టూ సేమ్‌ భువనేశ్వరి, బ్రహ్మాణి కలిసి పాదయాత్ర చేయాలని టీడీపీ నేతలు డిసైడ్ అయినట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ వరకు పాదయాత్ర చేస్తున్నారు లోకేష్. యువగళం పేరుతో దాదాపు 200 రోజుల పాదయాత్రను పూర్తిచేశారు లోకేష్. బాబు అరెస్ట్ కావడంతో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ కంటే బ్రహ్మాణి,భువనేశ్వరి పాదయాత్ర చేస్తేనే పార్టీకి మరింత సింపతి వస్తుందని భావించిన టీడీపీ నేతలు ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది.

లోకేశ్ కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బ్రాహ్మిణి , భువనేశ్వరి లను రాజకీయంగా యాక్టివ్ చేస్తే సెంటిమెంట్ కలిసివస్తుందని ఈ నిర్ణయానికి వచ్చారట. ఎన్నికల టైంలో కూడా బాబు జైల్లోనే ఉండాల్సి వస్తే వీరిద్దరి ప్రచారంతో ప్రజల్లో సానుభూతి పెరుగుతుందనేది భావిస్తున్నారు. మరి టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచిచూడాలి..

ఇక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా ఇన్నర్‌రింగ్ రోడ్ మార్పు కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ 21కి వాయిదా వేశారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ్‌ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌, లండన్‌ నుంచి వర్చువల్‌గా‌ హరీష్‌ సాల్వే వాదనలు వినిపించగా సీఐడీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -