Saturday, May 18, 2024
- Advertisement -

ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం..సీఐడీ ముందుకు లోకేష్

- Advertisement -

ఓ వైపు చంద్రబాబు మరోవైపు లోకేష్..అవినీతి కేసుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో నెలరోజులుగా రిమాండ్‌లో ఉన్నారు చంద్రబాబు. ఇక ఇప్పటికే బాబు ముందస్తు, క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా ఇవాళ బాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరగనుంది.

ఇక అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కాం కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ కేసులో లోకేష్ ను ఏ14 గా చేర్చగా ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు ద్వారా చంద్ర‌బాబు బినామీల‌కు ల‌బ్ది చేకూర్చే విధంగా వ్యవహరించాన్నది సీఐడీ ప్రధాన ఆరోపణ. ఇక కోర్టు సూచనల మేరకు లోకేష్ విచారణ జరగనుంది. ఉండవల్లిలోని తన నివాసం కుంచనపల్లిలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు లోకేష్. ఆయన్ని ప్రశ్నిస్తున్నారు సీఐడీ అధికారులు.

లోకేష్ పార్ట‌న‌ర్ గా ఉన్న హెరిటేజ్ సంస్థ‌కు ల‌బ్ది చేకూరాల‌నే ఉద్దేశంతోనే రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేశారని ఆరోపణలు రాగా దీనిపై ప్రధానంగా ప్రశ్నలు అడగనున్నారు సీఐడీ అధికారులు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్‌ పాత్రకు సంబంధించిన పక్కా ఆధారాలతో ఆయన్ని ప్రశ్నించనున్నారు. విచార‌ణ‌కు వ‌చ్చే స‌మ‌యంలో హెరిటేజ్ సంస్థ‌ భూముల కొనుగోలుకు సంబంధించిన‌ ప‌లు డాక్యుమెంట్లు తీసుకురావాల‌ని సీఐడీ అధికారులు తెలపగా విచారణలో లోకేష్ ఏం చెబుతారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -