Friday, April 26, 2024
- Advertisement -

సుడిగాలి సుధీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న గెటప్ శ్రీను.. ఏం చేశాడంటే?

- Advertisement -

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సుదీర్ వివిధ కార్యక్రమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సుధీర్,గెటప్ శ్రీను, రాంప్రసాద్, సన్నీ వీరు అందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారనే చెప్పవచ్చు. టీం లీడర్ సుధీర్ అయినప్పటికీ కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు నలుగురు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వీరు కేవలం జబర్దస్త్ కి మాత్రమే పరిమితం కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో చేస్తున్నారు.సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు కలిసి త్రీ మంకీస్ సినిమా కూడా చేశారు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎంతో కలిసిమెలిసి ఉండే వీరి మధ్య ఓ సినిమా ఈ విషయంలో విభేదాలు తలెత్తాయనే సమాచారం వినబడుతుంది.

Also read:తండ్రి మరణ రహస్యం గురించి చెప్పిన సురేఖా వాణి కూతురు?

సుధీర్ కి చెప్పకుండా గెటప్ శీను ఈ ముగ్గురు కలిసి త్రీ మంకీస్ తరహాలోనే ఒక సినిమా తీసే విధంగా ఒప్పుకున్నాడని తెలియడంతో గెటప్ శీను పై సుడిగాలి సుదీర్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ ఇప్పటికే సోలోగా సాఫ్ట్ వేర్ సుధీర్ ద్వారా మన ముందుకు వచ్చాడు.ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్లు సైతం సుడిగాలి సుదీర్ తో సినిమాలు చేయడానికి మక్కువ చూపుతున్నారు.అందరితో కలిసి త్రీ మంకీస్ తరహాలో సినిమా తీస్తే రెమ్యూనరేషన్ తక్కువగా వస్తుందన్న ఉద్దేశంతోనే సుడిగాలి సుదీర్ సోలోగా సినిమాలను తీయడానికి ఇష్టపడుతున్నాడనే సమాచారం వినిపిస్తుంది. ఈ క్రమంలోనే గెటప్ సీను తనకు తెలియకుండా ఓ సినిమాలో నటించడం కోసం ప్రొడ్యూసర్ తో కమిట్మెంట్ అయినట్లు తెలియడంతో సుధీర్ అసంతృప్తి చెందటం వల్ల గెటప్ శీను, చాలా అప్సెట్ అయి కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Also read:వామ్మో.. ఆ పని చేసిన నిహారిక కొణిదెల.. త్వరలోనే వీడియో కూడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -