Thursday, March 28, 2024
- Advertisement -

రుయా ఆస్పత్రి మృతులకు రూ. 10లక్షల పరిహారం : సీఎం జగన్

- Advertisement -

తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్సిజన్ లభ్యత లేక 11 మంది చనిపోవడంపై వివరణ ఇస్తూ, కొవిడ్ కట్టడి, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ అందజేత వంటి అంశాలపై తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వివరించారు. అయితే రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు.

మరణాల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా, తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన కరోనా బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కుటుంబాల వద్దకు వెళ్లి పరిహారం ఇవ్వాల‌ని కలెక్టర్లకు సీఎం జగన్ సూచించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. మరోవైపు ఏపీలో కరోనా కట్టడి చర్యలపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మద్యం షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు

ఆ కోరిక తీరకుండానే చనిపోయిన TNR.. చివరి వరకు అదే ధ్యాసలో?

తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -