Friday, April 26, 2024
- Advertisement -

వామ్మో.. ఆ పని చేసిన నిహారిక కొణిదెల.. త్వరలోనే వీడియో కూడా?

- Advertisement -

మెగా డాటర్ నిహారిక ఎప్పుడూ ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే. గత ఏడాది జొన్నలగడ్డ చైతన్య వివాహం చేసుకున్న నిహారిక ప్రస్తుతం అత్తారింట్లో ఎంతో సందడి చేస్తున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ నిహారిక జోష్ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటారు.

ఇదివరకే నిహారిక తనకు నచ్చిన రెసిపీలన్నింటిని చేస్తూ వాటిని అభిమానులతో పంచుకునే వారు. అయితే తన పాకశాస్త్ర రుచిని ఇప్పుడు అత్తారింట్లో కూడా చూపిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంవల్ల ఇంట్లోనే ఉండడంతో నిహారిక కొత్త కొత్త రెసిపిలను ట్రై చేస్తున్నారు.ఈ క్రమంలోనే మదర్స్ డే సందర్భంగా తన తల్లి ఫోటోను షేర్ చేస్తూ పెళ్లిలో అమ్మ ఎంతో అనారోగ్యంగా ఉన్న ఎంతో నవ్వుతూ సంతోషంగా పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారంటూ ఎమోషనల్ అవుతూ తన తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Also read:తప్పు నాది.. మా కుటుంబాన్ని ఎందుకు లాగింది? శ్రీరెడ్డిపై అభిరామ్ ఫైర్!

తాజాగా నిహారిక యాపిల్ పై అనే రెసిపిని తయారు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే యాపిల్ పై తయారు చేయడానికి కావలసిన పదార్థాలను చూపించి మరికాసేపట్లోఎంతో టేస్టీ యాపిల్ పై తయారవుతుందని తెలిపారు. తరువాత యాపిల్ పై తయారయ్యాక సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో సహానా అనే తన స్నేహితురాలు స్పందించి ఓ క్యూటీ పై యాపిల్ పైని తయారు చేసిందని కామెంట్ చేయగా..అవును నేనే చేశాను.. అంతే కాకుండా దీనికి సంబంధించిన వీడియో కూడా త్వరలోనే షేర్ చేస్తానని తెలిపారు.

Also read:పార్వతి మెల్టన్ ఇప్పుడు ఎక్కడ ఉంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -