Monday, June 17, 2024
- Advertisement -

సెంటిమెంట్‌ని తమ్మినేని అధిగమిస్తారా?

- Advertisement -

తెలుగు రాజకీయాల్లో స్పీకర్ పదవి అంటేనే ఎమ్మెల్యేలు భయపడిపోతుంటారు. ఎందుకంటే స్పీకర్‌గా పనిచేసిన వారు తర్వాత గెలిచిన చరిత్ర లేదు. ఇక కొంతమంది పలు ఎన్నికల్లో తలపడ్డ గెలుపు మాత్రం వరించలేదు. అయితే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ చరిత్రను తిరగరాశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్పీకర్‌గా పనిచేసిన పోచారం గత ఎన్నికల్లో గెలుపొంది ఆ సెంటిమెంట్‌ని చరిపేశారు.

ఇక ఏపీలో ఈ సెంటిమెంట్‌ని స్పీకర్ తమ్మినేని సీతారం అధిగమిస్తారా అని అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆముదాలవలస నుండి పోటీ చేసి గెలిచిన తమ్మినేని స్పీకర్ పదవి కట్టబెట్టారు జగన్. ఇక ఈ సారి కూడా ఆముదాలవలస నుండి పోటీ చేశారు. ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ఏపీలోనూ రికార్డు బ్రేక్ చేసిన వారు అవుతారు తమ్మినేని.

2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ పై తమ్మినేని గెలుపొందారు.ఈసారి వీరిద్దరి మధ్యే పోరు జరిగింది. ఇక తమ్మినేని స్వయాన మేనల్లుడు రవి. వీరిద్దరూ ఆముదాలవసలో తలపడటం ఆది నాలుగోసారి. అందుకే ఈసారి ఎన్నికల ప్రచారంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాలను హీటెక్కించారు. అయితే వైసీపీకి ఉన్న విశేష ప్రజాదరణే తన గెలుపుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు తమ్మినేని. అందుకే 20వేలకు పైబడి మెజారిటీ రాకపోతే తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని కూడా ప్రకటించారు. మొత్తంగా ఈ మామ, అల్లుళ్ళ పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -