Friday, May 17, 2024
- Advertisement -

రెబల్ ఎమ్మెల్యేలపై వేటే!

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల రేసులో వైసీపీ దూసుకుపోతుండగా ఆ పార్టీ సభలకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. ఇక టీడీపీ సభలు జనం లేక వెలవెలబోతున్నాయి.

ఓ వైపు సభలు, అభ్యర్థుల ఎంపికతో జగన్ దూకుడు మీదున్నారు. ఇక మరోవైపు తోక జాడించిన ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ నోటీసులు ఇవ్వగా శాసనసభ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేల వివరణ పూర్తి కాగా వీరిపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఇవాళో, రేపో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఇక రెబల్ ఎమ్మెల్యేలకు హైకోర్టులు చుక్కెదురు కాగా అనర్హత వేటు పడితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు కూడా కొల్పోనున్నారు. మొత్తంగా రాజ్యసభ ఎన్నికల రూపంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ తగలగా స్పీకర్ నిర్ణయం ఇప్పటికే అందరికి అర్ధమై పోయింది. దీంతో రెబల్ ఎమ్మెల్యేలపై వేటు ఖాయంగా కనిపిస్తోందని అంతా భావిస్తున్నారు.

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య పై అనర్హత వేటు పడినట్లే తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -