Tuesday, April 30, 2024
- Advertisement -

స్పీక‌ర్ విష‌యంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం…

- Advertisement -

ఏపీ కొత్త స్పీకర్‌గా ఎవరు ఎంపిక కాబోతున్నారనే సస్పెన్స్‌కు దాదాపుగా తెరపడింది. రేపు ఉద‌యం 25 మందితో జ‌గ‌న్ కేబినేట్ కొల‌వుతీర‌నుంది. అయితే స్పీక‌ర్ ప‌ద‌వికి ఎవ‌రికి జ‌గ‌న్ కేటాయిస్తార‌నె ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో స్పీకర్ పదవికి ఆనం రామనారాయణ రెడ్డి, రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లను జగన్ పరిశీలించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఇప్ప‌డు మాత్రం అనేహ్యంగా తెర‌పైకి కొత్త పేరు వ‌చ్చింది.

తాజాగా స్పీకర్ పోస్టుకు సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.వైసీపీఎల్పీ సమావేశం తరువాత తమ్మినేని సీతారాం సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీంతో ఆయనను స్పీకర్ పదవికి ఎంపిక చేశారనే వార్తలు మరింతగా బలపడ్డాయి.

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తమ్మినేని గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. కళింగ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తమ్మినేని సీతారం.కేబినెట్ లో బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తానని జగన్ చెప్పడం తెలిసిందే. స్పీకర్ పదవిని కూడా ఆ వర్గాలకే కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో జగన్ ని తమ్మినేని కలవడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -