Wednesday, May 7, 2025
- Advertisement -

నాగార్జునకు అఖిల్ తలనొప్పిగా మారాడు.. అసలు ఏం జరిగింది..?

- Advertisement -
Akhil rejecting good stories too now

రీసెంట్ గా టాలీవుడ్ లో వినిపిస్తోన్న పుకారు అందరినీ షాక్ చేస్తోంది. శ్రియాని ప్రేమించి పెళ్లికి రెడీ అయిన అఖిల్‌.. ఇప్పుడు ఆ ఆలోచన నుంచి బయటకు రావడానికి చూస్తున్నాడు. ఈ పెళ్లి చేసుకోను అని చెప్పుతున్నాడట. ఇందులో వాస్తవమెంత అనేది తెలియదు కానీ, అఖిల్‌ మొదట్నుంచీ ప్రతి విషయంలో క్లారిటీ లేకుండా ఉంటూ.. నాగ్‌కి హెడ్డేక్‌‍గా మారాడని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు.

మొదట క్రికెటర్‌ని అవుతానంటూ.. క్రికెట్ ని వదిలేసి సడన్‌గా సినిమాలోకి వచ్చి హీరో అయ్యాడు. హీరో అవ్వడం కోసం విదేశాల్లో ట్రెయినింగ్‌ కూడా తీసుకున్నాడు. మొదటి మంచి కథల కోసం చూద్దామంటే తనకి నచ్చిన కథనే తీద్దామంటూ వినాయక్‌ని ఫోర్స్‌ చేసి, నాగార్జునని బలవంతంగా ఒప్పించాడు. మొదటి సినిమా అఖిల్ ప్లాప్ అవ్వడంతో రెండో మూవీకి కంప్లీట్ గా తండ్రి మాట వింటానని చెప్పిన వాడే ఏ కథనీ తెగనివ్వలేదు.

మంచి కథలు చాలానే రిజెక్ట్‌ చేస్తూ వచ్చిన అఖిల్‌ తాజాగా విక్రమ్‌ కుమార్‌ కథకి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదట. అన్నిటికీ ఏదో వంక చెబుతోన్న అఖిల్‌తో పడలేనంటూ అతను నాగార్జునకి కంప్లయింట్‌ చేసాడట. కెరియర్‌ని అఖిల్‌ చక్కదిద్దే వరకు కొత్త కమిట్‌మెంట్లు పెట్టుకోరాదని ఇప్పుడు అతని అన్ని మీటింగ్స్‌లోను నాగ్‌ కూడా తప్పక హాజరవుతున్నాడట. ఒకవైపు అతని కెరియర్‌ చక్కదిద్దడానికే నాగ్‌ సమయం కేటాయించలేకపోతోంటే, తాజాగా పెళ్లి పుకార్లు మొదలయ్యాయి. అఖిల్‌ ఇంతవరకు వ్యవహరించిన తీరుని బట్టి ఈ పెళ్లి పుకార్లు కూడా నిజమే అయి వుంటాయంటూ అనుకుంటున్నారు సినీ జనాలు.

{youtube}AjCxmWBBOOM{/youtube}

Related

  1. సమంతను పట్టి పీడిస్తున్న నాగార్జున.. ఎందుకంటే..?
  2. ఆ స్టార్ హీరోకు నాగార్జున‌కు గొడవ.. కారణం ఇదే!
  3. బట్టతల గురించి షాకింగ్ నిజాలు చెప్పిన హీరో నాగార్జున!
  4. స‌మంత‌ను చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. ఎందుకంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -