Thursday, May 2, 2024
- Advertisement -

ఆ స్టార్ హీరోకు నాగార్జున‌కు గొడవ.. కారణం ఇదే!

- Advertisement -
story behind nagarjuna and star hero fight

టాలీవుడ్ లో ఈ వ‌య‌స్సు లో కూడా ఇంకా మ‌న్మ‌థుడిగానే కనిపిస్తాడు కింగ్ నాగార్జున‌. మ‌నం, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయ‌న వంటి సినిమాలతో వరస సూపర్ హిట్స్ అందుకున్న నాగ్ ఈ వయస్సులో కూడా యంగ్ హీరోలకు మంచి పోటీ ఇస్తున్నాడు. త్వరలో నాగ్ నటించిన ‘ఓం నమో వేంకటేశాయ’ అనే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. కె.రాఘ‌వేంద్ర‌రావు డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఆధ్యాత్మిక చిత్రం అవ్వటం వల్ల మాస్ ప్రేక్షకుల్ని సూర్య సినిమానే ఎక్కువ ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. నాగార్జున‌ చిత్రంకు పోటీగా మ‌రో స్టార్ హీరో చిత్రం రిలీజ్ అవుతుండ‌డంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య బాక్సాఫీస్ వేదిక‌గా పెద్ద ఫైటింగ్ త‌ప్పేలా లేదు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  ‘ఎస్-3’ మూవీ రిలీజ్ డేట్ అంటూ చాలా ప్రకటనలు చూశాం. ఇప్పుడు మరో డేట్ వచ్చింది. రెండు రోజుల కిందట ఈ సినిమాను జనవరి 26 నుంచి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు కొత్త‌గా ఎస్‌-3కు ఫిబ్ర‌వ‌రి 10ని కొత్త డేట్‌గా ఎనౌన్స్ చేశారు. దీంతో ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాలో వ‌స్తున్నాయి. తెలుగులో కూడా ఎస్‌-3పై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద వీరిద్ద‌రి మ‌ధ్య పెద్ద  వార్ జ‌ర‌గ‌నుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక హరి దర్శకత్వంలో ఎస్-3 తెరకెక్కింది. 

Related

  1. బట్టతల గురించి షాకింగ్ నిజాలు చెప్పిన హీరో నాగార్జున!
  2. స‌మంత‌ను చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. ఎందుకంటే..?
  3. దిల్ రాజు.. నాగార్జున మధ్య గొడవకు కారణం ఏంటి..?
  4. పెళ్లిళ్ల విషయంలో షాకింగ్ ట్విస్టులు ఇస్తున్న నాగార్జున

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -