Sunday, May 4, 2025
- Advertisement -

ఆలీ కి షాక్ ఇచ్చిన చిరు!

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 150 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాని చిరు తన 150 వ సినిమాగా తీస్తున్నాడు. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుపుకుంటుంది. చిరంజీవి కి తల్లిదండ్రులుగా చలపతి రావు, అన్నపూర్ణమ్మ లు నటిస్తున్నారని సమాచారం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది. అదేంటింటే.. చిరంజీవి, అలీ ఫై చేసిన సీన్స్ అంత బాగారాలేదని రీ షూట్ చేస్తున్నారట.

నిజానికి అలీ ప్లేస్ లో ముందుగా సునీల్ ని అనుకున్నాడు వినాయక్. సూనీల్ కు డేట్స్ లేని కారణంగా ఈ సినిమా చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా చేయడానికి సునీల్ ఓకే చెప్పడంతో, అలీతో చేసిన సీన్స్ రీ షూట్ చేసే బదులు సునీల్ ని ఆ ప్లేస్ లో పెట్టి షూట్ చేస్తే బాగుంటుందని వినాయక్ చిరు కు చెప్పడం జరిగిందట. దీనికి చిరు సైతం ఒకే చెప్పడం తో ఈ చిత్రం నుండి అలీ ని పంపేంచారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Related

  1. అనసూయని కొట్టబోయిన ఆలీ!
  2. పవన్ గురించి ఆలీ ఏం అన్నాడంటే?
  3. ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?
  4. చిరు సినిమాకి పవన్ సలహాలు చెప్పాడట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -