చిరు సినిమాకి పవన్ సలహాలు చెప్పాడట!

మెగాస్టార్ చిరంజీవి 150వ ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం కు వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీకి సలహాలు, సూచనలు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇస్తున్నాడ‌ని ఫిలింనగర్‌లో టాక్. పవన్ సూచనల మేరకే కీలక నిర్ణయాలు అన్నీ డిసైడ్ అయ్యాయని వినికిడి. చిరు 150వ సినిమాకు కత్తి చిత్రంను రీమేక్ చేయాలన్న సూచనే పవన్‍ కళ్యాణ్ దగ్గర నుంచి వెళ్లిందట.

ఈ కత్తి చిత్రం ముందుగా పవన్ దగ్గరకే వ‌చ్చింద‌ట‌. అయితే ఇలాంటి సినిమా అన్నయ్య అయితే బాగుంటుందని పవన్ డిసైడ్ చేసినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో కీలకమైన పాత్రకు సునీల్ డేట్లు దొరకక, వెన్నెల కిషోర్ పేరు వినిపిస్తున్న తరుణంలో కమెడియన్ ఆలీ పేరు సూచించింది కూడా పవనేనట. అంతేకాకుండా చిరు-అలీల మధ్యన కూడా మంచి సంబంధాలే ఉండటంతో చిరు కూడా పవన్ సూచనను అంగీకరించాడట.

ఆ తరువాత పొలికటికల్‌గా, మ‌నసుకు హ‌త్తుకునేలా సరైన పంచ్‌లు పడడం లేదని తెలిసి బుర్రా సాయిమాధవ్‌ను సూచించాడట పవన్ కళ్యాణ్. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్‌ను సెలెక్ట్ చేసింది కూడా పవన్ అని తెలుస్తోంది. ఇలా ప్రతి కీలకమైన విషయంలోనూ పవన్ అన్నయ్య సినిమాను ముందుకు నడిపిస్తున్నాడని స‌మాచారం. అన్నీ తానై అన్న‌య్య కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌ట ప‌వ‌న్.

Related

  1. పవన్ నిజంగానే కారును అమ్మేశాడా?
  2. పవన్ మళ్లీ ఆ తప్పే చేస్తున్నాడా?
  3. ఈటీవీ కి పవన్ షాక్!
  4. పవన్ కళ్యాణ్ కొంప ముంచుతాడా ?