అభిమానికి క్లాస్ పీకిన అనసూయ! ఎందుకంటే?

anasuya fires on fan in live chat

గతంలో చిత్రల్లో ఐటెమ్‌ సాంగ్‌ల్లో నటించేందుకు ఐటెమ్‌ భామలు ఉండేవారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని దగ్గర్నుంచి నిన్నటి మొమైత్‌ ఖాన్‌ వరకు అందరూ.. ఐటెమ్‌ గాళ్స్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మొత్తం మారిపోయింది.

భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయితే స్టార్‌ హీరోయిన్లే ఐటెమ్‌ సాంగ్‌ల్లో మెరవడానికి రెడీ అవుతున్నారు. మూడు నాలుగు రోజులు షూటింగ్ లో పాల్గొని కోటి రూపాలు సంపాధించుకుంటున్నారు. అయితే ఐటెమ్‌ భామలుగా పిలిపించుకోవడానికి మాత్రం సిద్ధపడడం లేదు. దీంతో ఐటెమ్‌ సాంగ్‌ కాస్తా స్పెషల్‌ సాంగ్‌గా మారిపోయింది. ఇప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ ‘విన్నర్‌’ సినిమాలో ఓ సాంగ్‌లో ఆడిపాడింది హాట్‌ యాంకర్‌ అనసూయ. ఇటీవలె ఆమె ఆన్‌లైన్‌ లైవ్‌ షోలో అభిమానులతో ముచ్చటించింది.

ఈ సందర్భంగా ఒక అభిమాని ‘మీరు విన్నర్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తున్నారట కదా’ అని అడిగాడు. ఈ మాటకు అనసూయ సీరియస్‌ అయిపోయింది. ‘ఐటెమ్‌ ఏంటి? అసలు ఐటెమ్‌ అంటే అర్థం ఏమిటి? ఐటెమ్‌ అంటే వస్తువు అని అర్థం. ఆడవాళ్లు నీకు వస్తువులా కనబడుతున్నారా? మీ ఆనందం కోసం స్పెషల్‌ సాంగ్స్‌లో నర్తిస్తుంటారంతే. దయచేసి అలాంటి పాటలను ఐటెమ్‌ సాంగ్స్‌ అని పిలవొద్దం’టూ క్లాస్‌ పీకింది.

{youtube}eDomskwP5Go{/youtube}

Related

  1. ఆ హీరోని పొగడ్తలతో ముంచెత్తిన అనసూయ!
  2. బ్ర‌హ్మీ, అనసూయ, ర‌ష్మీ సినిమా టైటిల్ ఇదే!
  3. అనసూయ బార్ లో ఏం చేసిందంటే?
  4. యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!