బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాఖ్యతగా తనదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమర్‌తో అదరగొట్టే ప్రదీప్ మాచిరాజు.. సుమ తరువాత గొప్ప యాంకర్‌గా పేరు సంపాదించుకున్నాడు. తనదైన శైలి హోస్టింగ్‌తో ఎన్నో షోలను విజయవంతంగా నడిపించాడు. ఇలా చాలా కాలంగా టెలివిజన్ రంగంలో తన హవా చూపిస్తున్న ప్రదీప్.. ఇటీవల ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జనవరి 29న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.
ఇక ఒక వైపు టీవీ షోలు, మరోవైపు సినిమాల తో బిజీ బిజీగా గడుపుతున్న ప్రదీప్…నెలకు ఎంత సంపాదిస్తున్నాడన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పలు చానళ్లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్.. నెలకు దాదాపు రూ.40 నుంచి 50 లక్షలు వరకు సంపాదిస్తున్నాడనే వార్తలో ఫిలీంవర్గాల్లో వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం టీవీ షోలో ఒక్కో ఎపిసోడ్ కు రూ.75 వేలు తీసుకునే ప్రదీప్.. ఇప్పుడు అదే షోకు లక్షన్నర వరకు తీసుకుంటున్నాడట.
అలాగే ఇటీవల విడుదలైన తన తొలి సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’కు రూ.25 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రదీప్ ఏడాదికి ఆరు కోట్లకు పైగా సంపాదిస్తున్నాడన్న మాట. ఇంత మొత్తంలో టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా సంపాదించడం లేదనేది ఫిలింనగర్ టాక్.
రాజుగారి ఇంట్లోకి కోడలిగా.. బడా బిజినెస్‌మెన్ కూతురు!
పట్టులాంటి జుట్టు కావాలా? అయితే ఇలా చేయండి.!
టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!
హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!