Friday, May 10, 2024
- Advertisement -

ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ కలెక్షన్లు!

- Advertisement -

తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ మేల్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. తనదైన శైలి యాంకరింగ్‌తో సత్తా చాటుతోన్న అతడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

అనూప్ సంగీతంలో రూపొందిన ‘నీలి నీలి ఆకాశం’ అనే ఒక్క పాట యూ ట్యూబ్ లో పెద్ద హిట్ అయ్యి ఈ చిత్రానికి బోలెడంత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక ‘జి.ఏ2.పిక్చర్స్’ ‘యూ.వీ. క్రియేషన్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి ముందుకు రావడంతో … జనవరి 29న విడుదలైంది.

చిత్రానికి 4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా …ఆ టార్గెట్ ను 4 రోజుల్లోనే ఛేదించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 7.24 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ మూవీ మంచి వసూళ్లతో లాభాలని సాధించి సూపర్ హిట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.

చలసాని శ్రీనివాస్‌ కుమార్తె ఆత్మహత్య .. కారణం అదేనా?

సిల్వ‌ర్ శారీలో త‌ళుక్కుమ‌న్న కైరా అద్వాని

బండ్ల గ‌ణేశ్ కు ప‌వ‌న్ గ్రీన్‌సిగ్న‌ల్‌.. పూరీ డైరెక్ష‌న్‌లో మూడో చిత్రం.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -