Wednesday, May 8, 2024
- Advertisement -

లాస్యపై కోపంతో రవి ఏం చేస్తున్నాడో తెలుసా..?

- Advertisement -
Anchor Ravi Shocking Decision Because Of Angry On Lasya

బుల్లి తెరపై రవి, లాస్యలు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అయితే ఇద్దరి మధ్య ఏవో విభేదాలు రావడంతో విడిపోయారు. కొంత కాలంగా వీరిద్దరు కలిసి షోలు చేయడం లేదు కదా.. కనీసం మొహం మొహం చూసుకుని మట్లాడుకున్నది కూడా లేదు.

రవికి పెళ్లి అయినా కూడా నన్ను ప్రేమించాడు.. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని లాస్య సంచలన వ్యాఖ్యలను చేసింది. రవిపై కోపంతోనే బుల్లి తెరకు దూరమైనట్లుగా లాస్య చెబుతూ ఉంది. లాస్య ప్రస్తుతం బుల్లి తెరకు దూరంగా ఉండి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. లాస్య నటించిన ‘రాజా మీరు కేక’ సినిమా  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సొంతంగా నిర్మాణం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లాస్య హీరోయిన్‌ అయ్యిందనే కోపమో లేక మరే ఉద్దేశ్యమో కాని రవి ఒక సినిమాను హీరోగా చేయబోతున్నాడు. సొంతంగా నిర్మాణం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

యాంకర్‌గా కెరీర్‌ పీక్స్‌లో ఉన్న రవి ఉన్నట్లుండి ఒక మూవీలో హీరోగా నటించాల్సిన అవసరం ఏంటి అంటే? లాస్యపై కోపమేనేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఒకానొక సందర్బంగా లాస్య చేసిన ఆరోపణలు అన్ని తప్పు అని, అయితే వాటికి వివరణ ఇచ్చేందుకు తాను సిద్దంగా లేను అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో రవికి లాస్యపై ఏ స్థాయిలో కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే లాస్యకు పోటీగా ‘ఇది మా ప్రేమ కథ’ అనే సినిమాని చేయబోతున్నాడు. మరి ఇందులో ఎవరి ప్రేమ కథ ఉంటుందో అనేది చూడాలి. ఈ చిత్రానికి రవి సన్నిహితుడు అయిన అయోధ్య కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

{youtube}mIeBax3IU_w{/youtube}

Related

  1. లాస్యకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రవి
  2. లాస్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రవి!
  3. రవి పై లాస్య సంచలన వ్యాఖ్యలు
  4. అప్పుడే లాస్య ను మోసం చేశారు.. ఎవరు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -