Wednesday, May 8, 2024
- Advertisement -

లాస్యకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రవి

- Advertisement -
Ravi Don’t Want React On Lasya Comments

రవి, లాస్యలు కలిసి చేసిన ఏ షో అయిన పక్క హిట్. వీరిద్దరూ కలిసి బుల్లి తెరపై ఏ రెంజ్ లో సందడి చేశారో ప్రత్యేకించి చెప్పకర్లేదు. వీరిద్దరు కలిసి ఓ షో చేస్తున్నారంటే ఆ షోకి కావాల్సినంతా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తారు. అంత బానే ఉంది అనుకున్న టైంలో ఒక్కసారిగా లాస్య బుల్లి తెరకు దూరం అయ్యింది.

ఎందుకు లాస్య బుల్లి తెరకు దూరమైయిందో అని ఆలోచిస్తున్న టైంలో వెండి తెరపైకి వస్తున్నట్లు తెలిపింది. ఇక తాజాగా చాలా కాలంగా ప్రేమిస్తున్న మంజునాధ్‌ను పెళ్లి కూడా చేసుకుంది. అయితే తాజాగా లాస్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యాంకర్ రవిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక వ్యక్తి రవితో సోషల్‌ మీడియాలో ఈ విషయమై అడిగాడు.

ఫేస్‌బుక్‌లో.. లాస్య ఏంటి ఇప్పుడు నిన్ను ఆ అబ్బాయి, ఈ అబ్బాయి అని పిలుస్తుంది, ఒకప్పుడేమో ఒరేయ్‌, అరేయ్‌ అంటూ మీద మీద పడేది, ఇప్పుడేమో నువ్వు అస్సలు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతుంది, దీని గురించి కాస్త క్లారిటీ ఇవ్వొచ్చుగా బయ్యా అంటూ రవి పేజ్‌లో ఒక వ్యక్తి కామెంట్‌ చేశాడు. అందుకు జవాబుగా రవి స్పందిస్తూ.. సొసైటీలో దరిద్రం బాబాయి, ఆడపిల్ల ఏం చెప్పినా నమ్ముతారు. అయితే వాటన్నింటిపై నేను క్లారిటీ ఇచ్చుకుంటూ ఉండలేను. ఎందుకంటే నేను ఇప్పుడు చాలా బిజీ కెరీర్‌ను కలిగి ఉన్నా. సొల్లు విషయాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అన్నట్లుగా రవి నేరుగా చెప్పేశాడు. 

Related

  1. రవి పై లాస్య సంచలన వ్యాఖ్యలు
  2. లాస్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రవి!
  3. లాస్య భర్త దగ్గర ఎంత ఆస్తి ఉందో తెలిస్తే వామ్మో అనాల్సిందే!
  4. అప్పుడే లాస్య ను మోసం చేశారు.. ఎవరు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -