Monday, April 29, 2024
- Advertisement -

లాస్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రవి!

- Advertisement -
Anchor ravi comments on lasya

బుల్లితెరపై విశేష ఆధరణ పొందిన జంట రవి, లాస్య. వీరిద్దరు కలిసి చేసిన దాదాపు అన్ని కార్యక్రమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో వీరిద్దరి క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. అంతా సాఫీగా సాగుతుందని భావిస్తున్న రవి, లాస్యల మద్య విభేదాలు తలెత్తి, ఇద్దరు విడిపోయారు. కొంత కాలం సైలెంట్‌గా ఉన్న లాస్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవిపై సంచలన ఆరోపణలు చేసింది. రవికి పెళ్లి అయినా కూడా తనతో ప్రేమను కోరుకున్నాడు అంటూ లాస్య చెప్పడంతో అంతా కూడా అవాక్కయ్యారు.  

తాజాగా లాస్య వివాహం చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్న మంజునాథ్‌తో అయ్యింది. ఇద్దరు కూడా సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సమయంలో లాస్యపై రవి సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. లాస్య పెళ్లి అయిన వెంటనే రవి తనకు అత్యంత సన్నిహితులతో మాట్లాడుతూ లాస్యతో తాను అన్ని షేర్‌ చేసుకున్నాను, మొదట లాస్య తనను ప్రేమించినట్లుగా చెప్పిందని, ఆ తర్వాత తాను కూడా లాస్యతో ప్రేమలో పడ్డానని రవి అన్నాడట.

తాను ఎప్పుడు లాస్యను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని, అయితే ఆమె మాత్రం ఉన్నట్లుండి ఎందుకు ఇలా ప్లేటు ఫిరాయించిందో అర్థం కావడం లేదు అంటూ రవి సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి లాస్య పెళ్లి అయినా కూడా రవి వ్యవహారం మాత్రం ఆమెను వదలడం లేదు. రవి చేసిన ఆరోపణలపై లాస్య ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

Related

  1. రవి పై లాస్య సంచలన వ్యాఖ్యలు
  2. లైవ్ లో పటాస్ రవి ఘోరంగా తిట్టిన ఫ్యాన్స్!
  3. అప్పుడే లాస్య ను మోసం చేశారు.. ఎవరు..?
  4. లాస్య భర్త దగ్గర ఎంత ఆస్తి ఉందో తెలిస్తే వామ్మో అనాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -