Sunday, May 19, 2024
- Advertisement -

అంజలి పెళ్లి ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

- Advertisement -
Anjali To Marry Jai Next Year

సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు కొత్తేం కాదు. చాలా కొద్దిమంది తప్పించి.. మిగిలిన వారంతా తమ లవ్ మ్యాటర్ ను రహస్యంగా ఉంచేందుకు విఫలయత్నం చేస్తుంటారు.ఆ క్రమంలో మీడియాకు పలుమార్లు దొరికిపోతుంటారు. అయినప్పటికీ.. తమ లవ్ మ్యాటర్ ను రివీల్ చేసేందుకు ఏమత్రం ఇష్టపడరు.

అలా అని దొరక్కుండా కూడా ఉండరు. లవ్ లో ఉంటూ దొరికిపోయే పలు జంటల మాదిరే తెలుగమ్మాయ్ అంజలి.. సినీహీరో జైతో కలిసి చెట్టాపట్టాలేసుకోవటమే కాదు.. లివింగ్ టు గెదర్ ఉన్నట్లుగా కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యన దోసెలు వేసి తినిపించిన పోస్ట్ ను సోషల్ మీడియా పెట్టి తమ మధ్యనున్న అనుబంధాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు.

అలా అని తమ మధ్యనున్న అనుబంధాన్ని మాత్రం ఓపెన్ చేయలేదు. ఫోటోతో తామిద్దరి మధ్యన ఎలాంటి బంధం ఉందో చెప్పిన ఈ ఇద్దరి మధ్యన ప్రేమ.. పెళ్లి దశను చేరుకుందని..వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవటం ఖాయమన్నమాట వినిపిస్తోంది. ఇరువురి ఇళ్లల్లోనూ వీరిద్దరి మ్యారేజ్ కి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న పలు చిత్రాల్ని వచ్చే ఏడాదికి పూర్తి చేసేశాక.. పెళ్లి పీటల మీదకు ఎక్కనున్నట్లుగా చెబుతున్నారు. లివింగ్ టు గెదర్ అంటూ కలిసున్న వేళ.. అధికారికంగా పెళ్లి చేసుకోవటం ఒకట్రెండేళ్లు ఆలస్యమైనా పెద్ద తేడా ఏం ఉంటుంది?

{youtube}ABOrevdOUeM{/youtube}

Related

  1. నిహారిక, బాల‌య్య కొడుకు అప్పుడే ఫిక్స్ అయ్యారు..
  2. బీకాంలో ఫిజిక్స్‌ ఎమ్మెల్యే పై రోజా కామెంట్స్
  3. బీకామ్‌ ఫిజిక్స్‌ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన జగన్
  4. పవన్ మూవీ లో సూపర్ స్టార్ ఫిక్స్!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -