Friday, March 29, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కూడా మొదలుపెట్టడా.. భార్య తో కలిసి..?

- Advertisement -

ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందన్న సంగతి తెలిసిందే.. ఆ పార్టీ ని ఓ కొత్త నాయకుడు వస్తే గానీ టీడీపీ గెలుస్తుందన్న ఆశలు ఇకపై సజీవంగా ఉండవు.. చంద్రబాబు కి  75 ఏళ్ళు పైబడిపోవడంతో ఇకపై పార్టీ నిడిపించే ఆలోచనలో అయన లేనట్లు తెలుస్తుంది.. పోనీ లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పజెబుదామా అంటే లోకేష్ వద్దని సొంత పార్టీ నేతలనుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.. లోకేష్ పార్టీ బాధ్యతలు అప్పగించే సమయం ఇంకా ఉందని, రాజకీయంగా లోకేష్ ఇంకా ఎదగాల్సి ఉందని ఒకవేళ తొందరపడి ఇప్పుడు లోకేష్ పగ్గాలు అప్పజెప్తే పార్టీ భవిష్యత్ లో కనపడదని అంటున్నారు..

ఏదేమైనా టీడీపీ కి ఓ సరికొత్త నాయకత్వ అవసరం అయితే ఉంది..  టీడీపీ లోని కొంతమంది జూ.ఎన్టీఆర్ రాకపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. టీడీపీ పార్టీ ఎంతలేదన్నా ఎన్టీఆర్ తాత సృష్టించిందే.. మధ్యలో చంద్రబాబు రాకపోయుంటే నందమూరి వారసులే ఇంకా దీన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలో పడిపోతున్న టీడీపీ ని మళ్ళీ లేపడానికి ఎన్టీఆర్ రూపంలో ఓ శక్తి కావాలని చాలామంది కోరుకుంటున్నారు.. ఇక ఎన్టీఆర్ దూరంగా ఉంటూనే రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కనపరుస్తున్నారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ ఇటీవలే ఓ  సేవా కార్యక్రమాన్ని స్థాపించడానికి రెడీ అయినట్లు గా టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నంలో స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంభందించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయన భార్య  లక్ష్మి ప్రణతితో కూడా ఇప్పటికే చర్చించారని లక్ష్మీప్రణతి ఈ బాధ్యతలను చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతున్నాడని తెలుస్తుంది.  ఏదేమైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆశించే అభిమానులకు ఇది శుభ పరిణామం అని చెప్పాలి.. అయితే ఎన్టీఆర్ వస్తే టీడీపీ లోకి వస్తాడా, వేరే పార్టీ లోకి వస్తాడా లేదా కొత్త పార్టీ పెడతాడా అనేది చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -