Friday, May 3, 2024
- Advertisement -

డబ్బులు లేక పెట్రోల్ బంక్ లో పని చేసిన రాజ్ తరుణ్..!

- Advertisement -

కొందరు హీరోలు బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వస్తే.. మరికొందరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవుతారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినిమా పరిశ్రమలోకి వచ్చాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సహాయ దర్శకుడిగా పని చేశాడు.

అయితే షార్ట్ ఫిల్మ్ ల్లో నటించిన రాజ్ తరుణ్ ఆ సమయంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడట. ఒకానొక సమయంలో ఇంట్లో డబ్బులు అడగలేక కొన్ని రోజుల పాటు సహాయ దర్శకుడిగా చేస్తూనే పెట్రోల్ బంక్ లో కూడా పని చేశాను అంటూ తాజాగా చెప్పుకొచ్చాడు. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మంచి హిట్స్ అందుకున్నాడు. మధ్యలో కాస్త డల్ అయిన మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ఇటీవలే ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్.. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన వ్యక్తిగత విషయాలు తెలిపాడు. పెట్రోల్ బంకులో పని చేసేటప్పుడు.. దాన్ని కష్టం అనుకోలేదు జీవితంలో భాగం అనుకున్నాను. అన్ని చిత్రాలు హిట్లు అవుతాయనే సినిమాలు చేస్తాం. కొన్ని సినిమాలు ప్లాప్ అయిన పెద్దగా పట్టించుకోం. కానీ అంధగాడు ఫ్లాప్ అయినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. . నా నుండి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో ఆ పాత్రలను చేసేందుకు నేను సిద్దంగా ఉన్నట్లుగా రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

ఎస్పీబీ విషయంలో చంద్రబాబు ఇంత చీప్ గా చేశాడేంటి..?

రాజ్ తరుణ్ తో ఇంకో సినిమా ఓకే చేసిన ఒరేయ్ బుజ్జిగ నిర్మాత..?

మేం వయసుకు వచ్చాం మూవీ హీరోయిన్ గుర్తుందా ?

మళ్ళీ త్రివిక్రమ్ ఆమెనే తీసుకుంటున్నాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -