Thursday, May 2, 2024
- Advertisement -

హిట్ డైరెక్టర్ కి హీరో లేడేంటి.. ఆయనకు ఏంటి దుస్థితి..?

- Advertisement -

టాలీవుడ్ లో కామెడీ తో కమర్షియల్ చిత్రాలు చేసే దర్శకులు చాల తక్కువ అని చెప్పాలి.. ఇలా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి.. ఎందుకంటే అటు హీరో ఇమేజ్ ను, ఇటు సినిమా కథకు జోడించి కామెడీ గా సినిమా ను కమర్షియల్ గా తెరకెక్కించాలంటే చాలా టెక్నీక్, సంయమనం ఉండాలి.. అలా టాలీవుడ్ కి దొరికిన అతి కొద్దీ మంది దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది..

తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు.. రాజా ది గ్రేట్, F2 , సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేస్తాడని మంచి కితాబు కూడా దక్కించుకున్నాడు.. ఇప్పుడు F3 మీద వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది.. రవితేజ వెంకీ, వరుణ్ లతో జాయిన్ కాబోతున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత అనిల్ నాగార్జున తో సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.. నాగార్జున గురించి చెప్పాలంటే ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు‌. గ‌త కొన్నేళ్లలో ఓం న‌మో వేంక‌టేశాయ‌, ఆఫీసర్, మ‌న్మ‌థుడు-2 లాంటి డిజాస్ట‌ర్లు ఖాతాలో వేసుకున్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం వైల్డ్ డాగ్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది పూర్త‌వ‌గానే ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేశాడు. దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఈ సినిమా తర్వాత అనిల్ సినిమా ఉంటందంటూ కొత్త‌గా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అనిలే ఆయ‌న్ని సంప్ర‌దించాడ‌ని.. వీళ్ల క‌ల‌యిక‌లో సినిమా వ‌చ్చే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు అనిల్ మరో సీనియర్ హీరో బాల‌కృష్ణ‌తో కూడా ఓ సినిమా చేయాల‌ని ఆశ‌ప‌డుతుండ‌గా.. ఆయ‌న ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.

నితిన్, ప్రభాస్ లకు ఉన్నంత గట్స్ ఎవరికీ లేకపాయె..?

ఉప్పెన, రెడ్ సినిమా లు ఇంతలా భయపడుతున్నాయేంటి..?

సోలో బ్రతుకు కు ఇంతకంటే బెటర్ ఆలోచన రాలేదా..?

రవితేజ నక్కిన ని పక్కన పెట్టాడా.. ఇప్పుడెలా.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -