Friday, March 29, 2024
- Advertisement -

ప్రేయసి కోసం రూ.23 కోట్ల విలువచేసే విల్లా కొన్న స్టార్ హీరో?

- Advertisement -

బాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ బర్డ్స్ గా పేరుగాంచిన అర్జున్ కపూర్ -మలైకా అరోరా మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు.గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమపక్షులుగా తిరుగుతున్న ఈ జంటకి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం బీ టౌన్ లో హల్ చల్ చేస్తోంది.ప్రస్తుతం తన సోదరితో కలిసి ముంబయిలోని ఓ ప్రాంతంలో నివాసముంటున్న అర్జున్ కపూర్ బాంద్రాలో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరూ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలో గల ఈ విల్లా కోసం అర్జున్ ఏకంగా రూ.23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. అర్జున్ కపూర్ కొనుగోలు చేసిన ఈ కొత్త ఇంటికి అతి దగ్గరలోనే తన ప్రేయసి మలైకా నివాసం ఉండటంతోనే అర్జున్ కపూర్ కూడా ఇక్కడ ఈ విల్లాను కొన్నట్లు తెలుస్తోంది.

Also read:వంశీ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ స్ట్రైట్ సినిమా?

కేవలం తన ప్రేయసి మలైకా కోసమే అర్జున్ కపూర్ ఇంత ఖరీదైన విల్లా కొన్నట్లు బీ టౌన్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట అర్జున్ కపూర్ కన్నా మలైకా వయసులో ఏకంగా 12 సంవత్సరాలు పెద్దది. వీరి ప్రేమ విషయం బయటపడినప్పుడు అందరూ వీరి వయస్సు గురించే మాట్లాడుకోవడంతో వయసుతో మాకు సంబంధం లేదు తమకి ప్రేమానుబంధాలు ముఖ్యమని ఈ జంట తెలిపిన సంగతి మనకు తెలిసిందే.

Also read:ఆ సెంటిమెంట్ తో భయపడుతున్న.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -