Monday, April 29, 2024
- Advertisement -

ఆ సెంటిమెంట్ తో భయపడుతున్న.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర దర్శకుల్లో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మూవీతో పాన్ ఇండియా దర్శకునిగా గుర్తింపు పొందాడు. రాజమౌళి దర్శకునిగా స్టూడెంట్ నెం.1 మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై తర్వాత చత్రపతి,విక్రమార్కుడు, యమదొంగ, మగధీర,బాహుబలి 1, బాహుబలి 2 వంటి బ్లాక్ బాస్టర్ మూవీలతో రాజమౌళి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా మూవీగా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

దర్శకధీరుడు రాజమౌళి గత సినిమాలకు నిర్మాణ దశలో ఉన్నప్పుడే శాటిలైట్‌, డిజిటల్‌, రీమేక్‌ హక్కులకు పోటీ నెలకొంటుంది. అలాగే తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల్ని పెన్ స్టుడియోస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Also read:ఏకంగా తనని టైటానిక్ హీరోయిన్ తో పోల్చుకున్న యంగ్ హీరో .. ఫోటో వైరల్!

తాజాగా పెన్ స్టుడియోస్ వారు ఆర్ఆర్ఆర్ మూవీ శాటిలైట్ రైట్స్ అమ్మగా దక్షిణాది భాషల శాటిలైట్ రైట్స్ స్టార్ గ్రూప్ వారు సొంతం చేసుకున్నారు. అలాగే హిందీ శాటిలైట్ హక్కులను జీ సినిమా సొంతం చేసుకుంది.అయితే జీ గ్రూప్ వారు సొంతం చేసుకున్న సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాపులుగానే మిగిలాయి. స్పైడ‌ర్, రాధే వంటి చిత్రాలు భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చిత్రానికి జీ5 బ్యాడ్ సెంటిమెంట్ గా మారుతుందేమో అని సినీ అభిమానులు భయపడుతున్నారు.అయితే రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేదు.కాబట్టి ఇలాంటి సెంటిమెంట్లకు భయపడాల్సిన పనిలేదు అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also read:బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్న సత్యదేవ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -