Wednesday, May 7, 2025
- Advertisement -

అల్లు అర్జున్ కి తలనొప్పిగా మారిన ప్రభాస్!

- Advertisement -
Baahubali Headache for Allu Arjun

ఏప్రిల్‌ 28 ‘బాహుబలి 2’ విడుదల తేదీని ప్రకటించడంతో ఈ సినిమాకి ముందు, వెనకా ఒక రెండు వారాలయినా గ్యాప్‌ ఇవ్వాలని నిర్మాతలు ఫిక్స్‌ అయిపోయారు. భారీ సినిమాల నిర్మాతలు కూడా ‘బాహుబలి’తో పోటీకి దిగడానికి ముందు అడగు వెయడం లేదు.

అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఏప్రిల్‌ 28కి వస్తుందని అంటే.. అందుకు అనుగుణంగా తమ చిత్రాలు ప్లాన్ చేసుకునే వీలుంటుంది. కానీ గ్రాఫిక్స్‌తో ముడిపడ్డ ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. తీరా బాహుబలి ఏప్రిల్‌ నెలాఖరులో వస్తుందని మే నెలలో రిలీజ్‌ ప్లాన్‌ చేసుకున్నాక, అప్పుడు ఈ చిత్రం ఆలస్యమైతే దాంతో పాటు తమ రిలీజ్‌ కూడా డిలే అవుతుంది. ఎప్పుడూ ఏప్రిల్‌లో తన చిత్రాలు రిలీజ్ చేసేందుకు ఇష్టపడే బన్నీ ఈసారి ఏప్రిల్‌ని బాహుబలికే వదిలేస్తున్నాడు.

మే మూడవ వారంలో ‘దువ్వాడ జగన్నాధమ్‌’ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ బాహుబలి విడుదల ఏ కారణంతో అయినా  లేట్‌ అయినట్టయితే  ఏప్రిల్‌ 21నే ‘డిజె’ విడుదల చేసేద్దామని కూడా అనుకుంటున్నారు. అందుకోసం ముందుగా షూటింగ్‌ కంప్లీట్ చేయడానికి కాస్త టైట్‌ షెడ్యూల్‌ కూడా వేసుకున్నారట. కాకపోతే ఇదంతా ‘ఒకవేళ బాహుబలి లేటయితే’ అన్న దానిమీదే తప్ప, అది టైమ్‌కి వచ్చేస్తే ‘డిజె’ కనీసం నెల రోజులు ఎదురుచూడక మానదు. ఒక్క అల్లు అర్జున్‍కి అనే కాదు.. ఏప్రిల్‌/మేలో విడుదల ప్లాన్‌ చేసుకున్న సినిమాలన్నిటిదీ ఇదే వరస.

Related

  1. పవన్ కి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్!
  2. అల్లూ అరవింద్ గురించి వింత విషయం చెప్పిన చరణ్
  3. అయ్యో.. పవన్ , ప్రభాస్ లకు ఇది నింజంగా చేదు వార్తే
  4. ప్రభాస్ తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -