Sunday, April 28, 2024
- Advertisement -

ప్రభాస్ తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -
prabhas next film remuneration shocking

‘బాహుబలి’ సినిమా తో తెలుగు మరింత క్రేజ్ సంపాధించుకున్నాడు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. ఈ చిత్రంతో ప్రభాస్ కు హింది, తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాధించుకున్నాడు. ఈ బాహుబలి సినిమా కోసం ప్రభాస్ నాలుగు సంవత్సరాలుగా కష్టపడ్డ విషయం తెలిసిందే.

ప్రభాస్ త్వరలోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసి ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది బాహుబలి 2 విడుదల కానుంది. ఇక ప్రభాస్ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా ఇప్పటికే ఖరారు అయ్యింది. సుజీత్‌  డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు ప్రభాస్‌ తర్వాత మూవీని నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం కోసం 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ రెండు పార్ట్‌లకు కలిపి తీసుకున్న రెమ్యునరేషన్ తన తర్వాత మూవీకి  ప్రభాస్‌ అందుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తెలుగులో ఇప్పటి వరకు ఏ టాప్ హీరో సైతం ఈ రెంజ్ రెమ్యునరేషన్ అందుకోలేదు. సుజీత్‌ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న మూవీకి 30 కోట్ల పారితోషికాన్ని ప్రభాస్‌కు వంశీ మరియు ప్రమోద్‌లు అందించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ రెంజ్ లో ఈ మూవీని తెరకెక్కించేందుకు సుజీత్‌ తీవ్రంగా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్నాడు. ఇక ఈ చిత్రం దాదాపు 100 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో తెరకెక్కబోతుందట. త్వరలో ఈ చిత్రంలో ప్రభాస సరసన నటించబోయే హీరోయిన్ ను ఎంపిక చేయనున్నారు.

Related

  1. వామ్మో ఆకాశంలో 30 కోట్లు ఎగరేసిన ప్రభాస్‌!
  2. ప్రభాస్ ఇంటి గురించి వివరాలు!
  3. ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తెలుసా?
  4. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -