Friday, May 17, 2024
- Advertisement -

ఆస్కార్‌ ఎంట్రీ జాబితాలో తెలంగాణ సినిమాలు

- Advertisement -

ప్రతిష్టాత్మక ఆస్కార్ ఎంట్రీ జాబితాలో నిలిచాయి తెలంగాణ సినిమాలు బలగం, దసరా. 2024 ఆస్కార్ చిత్రాల ఎంట్రీ ఎంపిక ప్రక్రియ మొదలుకాగా ఎంట్రీ జాబితాలో చోటు దక్కించుకున్నాయి ఈ రెండు సినిమాలు. దర్శకుడు గిరీష్‌ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నై కేంద్రంగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిశీలిస్తుండగా దేశవ్యాప్తంగా 22 చిత్రాలు అధికారిక ఎంట్రీలో చోటుదక్కించుకున్నాట్లు సమాచారం.

ఇందులో తెలుగు సినిమాలు బలగం, దసరా రెండు ఉన్నాయి. ఈ రెండు తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలే కావడం విశేషం. వీటిలో ప్రధానంగా తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని అద్భుతంగా తెరకెక్కించిన వేణు ‘బలగం’ ఆస్కార్‌ ఎంట్రీకి అర్హత సాధించే అవకాశాలున్నాయని సమాచారం. చిన్న సినిమాగా వచ్చిన బలగం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. కుటుంబ అనుబంధాల నేపథ్యంగా ఎక్కిన సినిమాతో విడిపోయిన అన్నదమ్ములు కూడా కలిశారంటే ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాను మెజార్టీ గ్రామాల్లో ప్రదర్శించారు. 100కి పైగా అంతర్జాతీయ అవార్డుల సాధించింది బలగం. ఇక శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో తెరకెక్కి సంచలన విజయం సాధించిన చిత్రం దసరా. తెలంగాణ యాసలో తెరకెక్కిన చిత్రం భారీ సక్సెస్ సాధించింది. రెండూ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు ఆస్కార్ ఎంట్రీ బరిలో ఉండటం నిజంగా గుడ్‌ న్యూసే.

ఇక వీటితో పాటు ది స్టోరీ టెల్లర్‌, మ్యూజిక్‌ స్కూల్‌ , మిస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే , ట్వివెల్త్‌ ఫెయిల్‌, ఘూమర్‌, గదర్‌-2, రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని, జ్విగాటో, ది కేరళ స్టోరీ చిత్రాలు కూడా ఆస్కార్ ఎంట్రీ రేసులో ఉండగా తమిళం నుంచి విడుదలై-1 సినిమా పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాల్లో ఒకదానికి ఎంపిక చేసి భారత్‌ తరపున ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్‌కు పంపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -