12 కోట్లతో భారీ సినిమా సెట్.. తగ్గేదేలే అంటున్న హీరో..

మంచి కథలకు ఎంచుకుని సినిమాలు చేస్తారు హీరో నాని. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా విజయంతో మంచి ఊపుమీదున్న నాని వరుసగా సినమాలు చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ‘అంటే సుందరాని కి ’ షూటింగ్ ఇటీవల పూర్తయింది.

తర్వాత ‘దసరా’ చిత్రానికి నాని ఓకే చెప్పారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈసినిమాలో పల్లె వాతావరణాన్ని తలపించేలా రూ.12 కోట్లతో పల్లె సెట్ వేస్తున్నారట. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఐదెకరాల్లో అద్భుతంగా సెట్ ను వేసిన అవినాశ్ కొల్ల ఈ పల్లె సెట్ ను తీర్చిదిద్దుతున్నారు.

ఇందుకోసం హైదరాబాద్ పరిసర ప్రాతంలోని 12 ఎకరాల స్థలాన్ని ఎంచుకున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: యాంకర్‌ అనసూయ క్షమాపణలు

Related Articles

Most Populer

Recent Posts