సంక్రాంతి వచ్చేస్తోంది. బాబాయ్ అబ్బాయ్ లు నువ్వా నేనా అని తేల్చుకునే పనిలో పడ్డారు. అటు మెగా కాంపౌండే కాదు…. ఇటు మేము కూడా ఫైట్ చేస్తున్నామంటూ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు.
దీంతో సంక్రాంతికి బాబాయ్ అబ్బాయ్ ల గొడవ రచ్చకెక్కడానికి రెఢీ అవుతోంది. తారక్ ను చూస్తే సుకుమార్ చిత్రం ఆల్రెడీ జనవరి 8 అని చెప్పి డేట్ ఇచ్చేశాడు. బాలయ్య డిక్టేటర్ డిసెంబర్ కు పూర్తి అవుతుంది. ఆలెక్కన చూస్తే….సినిమా జనవరి కి రావచ్చు. దీనికి తోడు బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ కూడా ఉంది. దీంతో పెద్ద చిక్కు వచ్చి పడింది.సో….. ఎందుకొచ్చిన గోల, అసలే మన ఇమేజ్ అంతంత మాత్రమే అని చెప్పి… ఇపుడున్న టైమ్లో తారక్ వెనక్కి వెళతాడా…? లేక బాలయ్యే బుడ్డోడితో నాకెందుకని తగ్గుతాడా అని ఫిలింనగర్లో రకరకాల వాదనలు జరుగుతున్నాయి.అయితే సినిమా రిలీజ్ డేట్ వచ్చే సరికి ఇద్దరి చిత్రాల విషయంలో ప్రొడ్యూసర్లు మాత్రం బాబోయ్ బాబాయ్ అబ్బాయ్ అంటూ తలలు పట్టుకోవల్సిందేనని చెబుతున్నారు.