Sunday, April 28, 2024
- Advertisement -

బాబుతో బాలయ్య “UNSTOPPABLE”.. వెన్నుపోటు తెరపైకి వస్తుందా ?

- Advertisement -

ప్రస్తుతం ఎక్కడ చూసిన నందమూరి బాలకృష్ణ చేయబోయే టాక్ షో ” ఆన్ స్టాపాబుల్ సీజన్ 2 ” కు సంబంధించిన చర్చే జరుగుతోంది. మొదటి సీజన్ లో బాలయ్య చేసిన హంగామా ను తెలుగు ప్రేక్షకులు అంతా తేలికగా మరిచిపోలేరు. ఇప్పటివరకు ఎన్నో టాక్ షోలు వచ్చినప్పటికి.. వాటన్నిటిని మరిపించేలా ” ఆన్ స్టాపాబుల్ ” షోను బాలయ్య నడిపించిన తీరుకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టాక్ షో గా ” ఆన్ స్టాపాబుల్ ” షో నిలిచింది. దాంతో మొదటి సీజన్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకొని రెండవ సీజన్ ను మరింత గ్రాండ్ గా నిర్వహించేందుకు ఆహా యూనిట్ సిద్దమైంది.

ఇందులో బాగంగా ఈసారి సినీ సెలబ్రేటీలతో పాటు రాజకీయ నాయకులతో కూడా ఇంటర్యూలు నిర్వహించేందుకు సిద్దమైంది ఆహా టిమ్. అందులో భాగంగా ” ఆన్ స్టాపాబుల్ సీజన్ 2 ” మొదటి ఎపిసోడ్ కు చీఫ్ గెస్ట్ గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి అయిందట. మరి భామర్ది బాలయ్యతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి విషయాలు పంచుకొనున్నారు అనేది పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ. సాధారణంగా చంద్రబాబు మీడియా సమావేశాలలో తప్పా.. ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు.

గతంలో ఏబీఎన్ లో నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో మాత్రమే చంద్రబాబు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ తరువాత ఇన్నాళ్లకు మళ్ళీ ఇప్పుడు బాలయ్యతో ” ఆన్ స్టాపాబుల్ సీజన్ 2 ” లో పాల్గొంటున్నారు. అయితే చంద్రబాబు ఈ టాక్ షో కు రావడానికి కూడా భారీ వ్యూహమే ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా చంద్రబాబు చాలా రిజర్వ్ గా ఉంటారు. తనను ఇబ్బంది పెట్టె అంశాలపై పెద్దగా ప్రస్తావించరు.. కానీ బాలయ్య టాక్ షోలో మాత్రం అన్నీ విషయాలపై ఓపెన్ అయ్యేటట్లుగా చంద్రబాబు సిద్దమయ్యారట. చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థి పార్టీ నేతలు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అంశాన్ని తెరపైకి తెస్తారు.

దాంతో ఈ వెన్నుపోటు అంశానికి సంబంధించి చంద్రబాబు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.. ఎప్పుడు కూడా దాటవేసే దొరణీనే అవలంభిస్తువచ్చారు. దాంతో చంద్రబాబు రాజకీయ జీవితానికి వెన్నుపోటు అంశం ఎప్పటికీ చెరిగిపోని మచ్చల మారింది. దాంతో ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చేందుకే బాలయ్య షో కు చంద్రబాబు గెస్ట్ గా వెళుతున్నారని సమాచారం. మరోవైపు చంద్రబాబు ” ఆన్ స్టాపాబుల్ ” షో కు వెళ్లడంపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీ కాదని బామర్ధి షోకు వెళ్ళిన బాబు అంటూ అంబటి రాంబాబు ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు బాలయ్య షో కు వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది.

Also Read

టి‌ఆర్‌ఎస్ (TRS) చాప్టర్ క్లోజ్.. ఇక కే‌సి‌ఆర్ కు గడ్డుకాలమే !

జనసేనలోకి చిరు ఎంట్రీ.. పవన్ ఒప్పుకుంటాడా ?

గాడ్ ఫాదర్ అంతా బాగుంది కానీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -