Saturday, May 4, 2024
- Advertisement -

బాలయ్యతో అనిల్ రావిపూడి రిస్క్ చేస్తున్నాడా ?

- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ మూవీ అనౌన్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరసింహారెడ్డి మూవీ చేస్తున్న బాలయ్య ఈ మూవీ తరువాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బౌండెడ్ స్క్రిప్ట్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఇక డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. అయితే పక్కా కమర్షియల్ స్టోరీలతో కామిడీని ఓ రేంజ్ లో పండించే అనిల్ బాలయ్యతో ఎలాంటి మూవీ తీయబోతున్నాడని అందరిలోనూ ఓ క్యూరియారిటీ ఉంది. అయితే ఇటీవల ఓ టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అనిల్ రావిపూడి. .

ఈ మూవీ పక్కా బాలయ్య మూవీ అని, ఆయన అభిమానులు కోరుకునే అన్నీ అంశాలు ఇందులో ఉంటాయని చెప్పుకొచ్చారు. అన్నీ కమర్షియల్ హంగులతో పాటు ఈసారి కాస్త రియలిస్టిక్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందని అనిల్ హింట్ ఇచ్చారు. ఇక ఈ మూవీలో బాలయ్య పెళ్లీడుకొచ్చిన కూతురి తండ్రి పాత్రలో నటిస్తున్నదని సమాచారం. బాలయ్య కూతురిగా శ్రీలీల నటుస్తుందట. మరి ఇప్పటివరకు తన మూవీస్ లో కామిడీ కే అధిక ప్రాధాన్యం ఇచ్చిన అనిల్ రావిపూడి.. బాలయ్యతో మాత్రం కాస్త డిఫరెంట్ గా రియలిస్టిక్ డ్రామాతో వస్తుండడంతో.. అనిల్ రిస్క్ చేస్తున్నడేమో ఇండస్ట్రీ ఇన్ సైడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో బాలయ్య 100 వ మూవీకి అనిల్ రావిపూడి పేరు కూడా గట్టిగానే వినిపించింప్పటికి.. అప్పుడు ఈ కాంబో సెట్ కాలేదు.. కానీ అయిదేళ్ళ తరువాత ఈ కాంబినేషన్ కుదరడంతో.. బాలయ్య అభిమానుల్లో ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ ను డిసెంబర్ లో స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి

ఆ బయోపిక్ ను మహేశ్ రిజక్ట్ చేశాడా ?

పుష్పా2 లో విలన్ గా స్టార్ హీరోయిన్?

మహేశ్ రాజమౌళి స్టోరీ అదేనట.. రాజమౌళి క్లారిటీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -