Thursday, March 28, 2024
- Advertisement -

‘ఆచార్య’చరణ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కొరటాల

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి దేశభక్తి చిత్రంతో వచ్చారు.. కానీ ఈ మూవీ పెద్దగా ప్రేక్షకాదరణ లభించలేదు. ప్రస్తుతం హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్న కరోనా మహమ్మారి కారణంగా వాయిదాలు పడుతూ వస్తుంది.

ఓ పది రోజుల పాటు చిత్రీకరణ జరిపితే, ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల హీరోయిన్ గా నటిస్తుంది. మరో ముఖ్య పాత్రల్లో రామ్ చరణ్, పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ‘సిద్ధా’ అనే పవర్ఫుల్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడని అన్నారు. అయితే ఈ పాత్ర నిడివి అరగంటలోపే ఉంటుందనీ, ఆ సమయంలోనే రెండు పాటలు ఉంటాయనే టాక్ వినిపించింది. దాంతో రామ్ చరణ్ ‘ఆచార్య’లో గెస్ట్ రోల్ అని వార్తలు వెలువడ్డాయి.

తాజాగా ఈ విషయం పై కొరటాల క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్టు రోల్ కాదని.. ఆయనతో కీలక సన్నివేశాలు ముడిపడి ఉన్నాయని అన్నారు. అంతే కాదు సెకండ్ ఆఫ్ లో రామ్ చరణ్ పాత్ర ఎంతో అద్భుతంగా తీర్చబడిందని అన్నారు. అయితే ఇందులో చిరు, రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా కనిపిస్తాన్న విషయం పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఆశయం పరంగానే వాళ్ల మధ్య అనుబంధం ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

చిట్టి కూతురు తీసిన సెల్ఫీని చూసి మురిసిపోతున్న నమ్రత..?

పుష్పకు అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. వింటే ఉగిపోవాల్సిందే?

ఉత్కంఠ రేపుతున్న ‘క‌ప‌ట‌నాట‌క సూత్ర‌ధారి’ట్రైల‌ర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -