Saturday, April 27, 2024
- Advertisement -

మోనాల్ అంటే అఖిల్ కు అంతా ప్రేమా? వామ్మో!

- Advertisement -

బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ ఫోర్ రియాలిటీ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన వారిలో మోనాల్, అఖిల్ జంట ఒకటి. హౌస్ లో ఉన్నంత సేపు వీరి మధ్య ఉన్న చనువు చూసి కచ్చితంగా వీరి మధ్య ప్రేమ ప్రయాణం నడుస్తోందని, హౌస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం వినిపించింది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఈ జంట బయట కూడా అదే స్థాయిలో ఎంతో చనువుగా కనిపించారు.

ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలకు జంటగా హాజరైన మోనాల్ అఖిల్ ఎంతో చనువుగా ఉన్నప్పటికీ వీరి మధ్య మాత్రం ప్రేమ లేదని, కేవలం స్నేహం మాత్రమే అని చెప్పుకొచ్చారు. కానీ అప్పుడప్పుడు వీరి ప్రేమ వ్యవహారం పరోక్షంగా బయటపెడుతూ చేసే పోస్టులు అభిమానులకు మరింత సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే అఖిల్ మోనాల్ ను తన రాణి అంటూ సంబోధించడంతో వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ప్రేమ వ్యవహారం ఉందని తెలిసిపోయింది.

Also read:త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా… త్వరలోనే ప్రకటన?

మే 13 మోనాల్ పుట్టినరోజు సందర్భంగా అఖిల్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మోనాల్ కు అఖిల్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎన్నో రాణిలకు సంబంధించిన కథలను విన్నాం.. కానీ రియల్ లైఫ్ రాణివి మాత్రం నువ్వే అంటూ మోనాల్ పై తనకున్న ప్రేమను కురిపించాడు. మోనాల్ ను పరిచయం చేసినందుకు అఖిల్ బిగ్ బాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అఖిల్ కు మోనాల్ అంటే ఇంత ప్రేమా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also read:14 ఏళ్లకే ఆ పని చేసిన సురేఖ వాణి.. ఏది అంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -