Thursday, May 2, 2024
- Advertisement -

మోనాల్ విషయంలో కొట్టుకునే వరకు వెళ్ళిన అభిజిత్, అఖిల్..!

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 4 ఐదో వారంలోకి అడుగు పెట్టింది. సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే గొడవలు జరుగుతున్నాయి. అభిజిత్ అఖిల్ మోనాల్ ట్రయాంగిల్ కథ అందరికీ తెలిసిందే. అభిజిత్ అఖిల్ తో మోనల్ క్లోజ్ గా ఉంటుంది. కానీ అభిజిత్, అఖిల్ మాత్రం శత్రువుల్లా మారిపోయారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి అసలు పడటం లేదు. మోనల్ ఇద్దరితో ఆడుకుంటుందని చూసేవారికి అర్దం అవుతుంది.

అఖిల్‌తో కాసేపు ఉంటే అభితో కాసేపు ఉంటుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా అఖిల్ పేరును అభిజిత్ చెప్పినట్లు తాజా ప్రోమోతో తెలుస్తోంది. ఇక కారణాలు చెప్పడంతో అఖిల్ మాటల యుద్దానికి దిగినట్టు తెలుస్తోంది. నువ్ కన్ఫ్యూజ్ అవుతావ్ అని నాకు తెలుసు. కానీ పచ్చి అబద్దాలు మాట్లాడుతావని ఇప్పుడు తెలుసింది. కళ్లు ఎగిరేసి.. అలా చూసి ఇలా చూసి మాట్లాడితే భయపడతారని అనుకోకు అని అభి గట్టిగా ఇచ్చాడు. వేలు అలా చూపించి మాట్లాడకు డూడ్ అంటూ అఖిల్ రెచ్చిపోయాడు.

ప్రతీసారి నువ్ చేసేది అదే అంటూ మరో కౌంటర్ వేశాడు. నువ్ ఆ రోజు మోనాల్‌ మీద కూడా అలాగే వేలు పెట్టి చూపించావ్ అని అఖిల్ అనడంతో.. ఆమె ఇష్యూ నీకెందుకు బ్రదర్ అని అఖిల్ అన్నాడు. అమ్మాయి గురించి అలా మాట్లాడితే.. ఆమె క్యారెక్టర్ బయటకు ఎలా వెళ్తుందో అని అఖిల్ రెచ్చిపోయాడు. అది మేమిద్దరం చూసుకుంటాం నీకెందుకు అని అభిజిత్ రెచ్చిపోయాడు. ఈ గొడవ చూసి మోనాల్ బోరున ఏడిస్తూ నా పేరు మధ్యలో లాగాకండి అని అరిచింది. ఆ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

పవన్ ఫ్యాన్స్ జోలికి వెళ్లిన దేవి నాగవల్లి.. ఏమైంది ?

బెడ్ రూమ్ సీన్స్ చేసి తప్పు చేశాను : ఆండ్రియా

బిగ్ బాస్ వాళ్ళు నన్ను మోసం చేశారు : నటి కస్తూరి

అదిరిందికి శ్రీముఖి వచ్చింది.. రవి వెళ్ళాడు.. ఏంటి ఈ డ్రామా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -