Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ చంద్రబాబు చేసే తప్పు చేస్తున్నాడా.. అయితే కష్టమే..?

- Advertisement -

గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు జగన్ చేస్తున్నాడా..? చంద్రబాబు ను ఏ అంశాలైతే ఓడిపోవడానికి దోహదపడ్డాయి ఆ అంశాలనే ఇప్పుడు జగన్ పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.. ప్రజల్లో మంచి పేరునా చంద్రబాబు ను బాగా దెబ్బ కొట్టింది సొంత నేతల అవినీతి ని కనిపెట్టకపోవడం.. సొంత నేతలు చంద్రబాబు వెనకాల ఏం చేస్తున్నారో గమనించకపోవడం.. అవే చంద్రబాబు ను బాగా దెబ్బతీశాయని చెప్పొచ్చు.. ఇప్పుడు ఎన్ని వింషలు చేస్తున్న ప్రజలు పట్టించుకోవట్లేదు..

ఇక వీటి తో పాటు చంద్రబాబు అధికారంలోకి పార్టీ ని రానివ్వకుండా అధికారులనే నమ్ముకోవడంతో పార్టీ ని ప్రజలు చేరడంలో విఫలమయ్యారు అంతేకాదు అధికారాలతోనే ఎక్కువగా ప్రజలు మమేకం అవడంతో నేతల అవసరం రాలేదు.. దాంతో నేతల అవసరం ప్రజలకు లేకపోవడంతో వారు లీడర్ల కు దూరం అయిపోయారు. దాంతో ఆటోమేటిక్ గా ప్రజలకు పార్టీ దూరం కావడంతో ప్రజలు టీడీపీ కి కాకుండా వైసీపీ కి ఓటేశారని పార్టీ సభ్యులు అంటున్నారు.. ఇప్పుడు అదే తప్పు జగన్ కూడా చేస్తున్నారని వైసీపీ పార్టీ సభ్యులు అంటున్నారు..

వాస్తవానికి జగన్ అధికారంలోకి వచ్చాక జిల్లా కలెక్టర్లను ఎక్కువగా నమ్ముకున్నారు.. లేదంటే వాలంటీర్లను ప్రతి దానికి పురమాయిస్తున్నారు.. కానీ పార్టీ నేతలను ఎక్కువగా పట్టించుకోవట్లేదు. అంతేకాదు పార్టీ ఆఫీసుల తలుపులకు తాళాలు పడి చాలా కాలం అయింది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు తన సొంత ఆఫీసులు తెరచారు. వారి మద్దతుదారులతోనే అవి నడుస్తున్నాయి. మిగిలిన పార్టీ వారికి అక్కడ నో ఎంట్రీ. తమను ఎమ్మెల్యేలు అసలు పట్టించుకోవడంలేదని పార్టీ పెద్దలకు చెబుతామంటే అసలు పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. జిల్లాల కార్యవర్గాలు ఉన్నాయా. ఈ డౌట్ వైసీపీలోని సగటు కార్యకర్తకు ఉంటే ఇక సామాన్య జనానికి వైసీపీ గుర్తుండాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ మళ్ళీ తన పంథా ను అనుసరిస్తాడా అనేది చూడాలి..

డిక్లరేషన్ పై చంద్రబాబు ఎందుకంత పోరాటం చేస్తున్నారు.. అవి బయటపడతాయనేనా.. ..?

చంద్రబాబు కు ఇప్పుడు వాళ్ళే దిక్కా..?

సీఎం జగన్ ప్లాన్ కి విలవిలలాడుతున్న చంద్రబాబు..!

అయోమయంలో టీడీపీ ఇన్ ఛార్జ్ లు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -