Saturday, April 27, 2024
- Advertisement -

ఆశు రెడ్డికి ముద్దు పెడుతూ అసలు విషయాన్నీ బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్!

- Advertisement -

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ 3‌ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఇండస్ట్రీలో సింగర్ గా మరోవైపు వరుసఅవకాశాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాహుల్ హీరోగా “చిచా” సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి బిజీగా ఉంటున్నాడు. రాహుల్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయినా పునర్నవి, అషురెడ్డిలతో ప్రేమాయణం నడిపి పాపులర్ అయ్యాడు.

ఇటీవలే రాహుల్ సిప్లిగంజ్ జూనియర్‌ సమంతగా గుర్తింపు పొందిన అషురెడ్డితో ప్రేమలో ఉన్నాడేమో అనిపించేలా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు,అలాగే అషురెడ్డిని రాహుల్ ఎత్తుకొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న సందేహం అందరిలోనూ నెలకొంది.

Also read:హ్యాపీ డేస్ అంటూ యాంకర్ రవి షోకు వచ్చిన టిక్ టాక్ భార్గవ్?

తాజాగా రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌ అంటూ లవ్‌ సింబల్‌ పెట్టి పోస్టు చేశాడు. ఈ సర్‌ప్రైజ్‌ కచ్చితంగా రాహుల్, అషురెడ్డిల ప్రేమ విషయమే అయి ఉంటుందని చాలామంది ఊహిస్తున్నారు. అలాగే మీరు కచ్చితంగా త్వరలో వివాహం చేసుకోబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషురెడ్డి ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తూనే తన యూట్యూబ్ ఛానల్లో బిజీగా గడిపేస్తోంది.

Also read:భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -