Thursday, May 2, 2024
- Advertisement -

హ్యాపీ డేస్ అంటూ యాంకర్ రవి షోకు వచ్చిన టిక్ టాక్ భార్గవ్?

- Advertisement -

అదృష్టం కలిసి వస్తే కొందరు రాత్రికి రాత్రే స్టార్ లుగా మారిపోతారు. ఎంత త్వరగా అయితే మంచి క్రేజ్ సంపాదించుకుంటారో అంతే తొందరగా తమకు దక్కిన పేరును పోగొట్టుకుంటారు.ఈ విధంగా అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబ్, టిక్ టాక్ ద్వారా స్టార్ గా కొనసాగిన భార్గవ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

వచ్చీరాని ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ అమ్మాయిలతో చేసే వీడియోలకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ విధంగా సంపాదించుకున్న క్రేజ్ ను చెడు వ్యసనాల కోసం ఉపయోగించుకుంటూ మైనర్ బాలికలను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అమ్మాయిలను లైంగికంగా వేధించిన ఆరోపణలు తలెత్తడంతో ప్రస్తుతం భార్గవ్ జైలు పాలయ్యాడు. ఈ విధంగా భార్గవ్ చేసిన పనికి ఎంతో మంది అతని పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తికి సరైన శిక్ష పడాలని పలువురు ఆరోపించారు.

Also read:రామ్ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో..!

ఇలాంటి నేరారోపణల కింద జైలు శిక్ష అనుభవిస్తున్న భార్గవ్ ఉన్నపళంగా బుల్లితెరపై ప్రత్యక్షమయ్యాడు . అయితే భార్గవ్ పై ఆరోపణలు జరగకుముందే ఈ షో షూటింగ్ జరిగింది. యాంకర్ రవి, అషూలు కలిసి హ్యాపీడేస్ అనే షోతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితమే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ షో సోమవారం నుంచి కొత్త ప్రచారం చేస్తున్నారు. రెండో ఎపిసోడ్ లో భార్గవ్ కనిపించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ షో లో భార్గవ్ ని చూడగానే నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తారని భావించిన నిర్వాహకులు ఈ వీడియోలో కామెంట్ సెక్షన్ ఆఫ్ చేశారు. ఈ షోకి భార్గవ్ దెబ్బ గట్టిగానే పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నెటిజన్లకు భార్గవ్ పై ఉన్న కోపం కూడా తగ్గలేదని తెలుస్తోంది.

Also read:కేజిఎఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. అసలు నిజం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -