Monday, April 29, 2024
- Advertisement -

బాలీవుడ్ లో ప్రభాస్ తరువాతే.. షారుక్, హృతిక్ !

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ కు ఇండియా వైడ్ గా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాహుబలి తరువాత ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాధించుకున్న ప్రభాస్..ప్రస్తుతం నేషనల్ స్టార్ గా బాలీవుడ్ ఆగ్రహీరోలకు సొంతం కానీ ఇమేజ్ ను ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్న సాహో మూవీతోనే 300 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్.. ఆ తరువాత వచ్చిన రాధే శ్యామ్ తో నిరాశపరిచాడు. అయినప్పటికి ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తన తరువాతి సినిమాకోసం ఇండియా వైడ్ గా వెయిటింగ్ నడుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ ” ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే.. ” చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే.. ప్రభాస్ సెట్ చేసిన రికార్డ్స్ ను బాలీవుడ్ అగ్రహీరోలు సైతం అందుకోలేకపోవడం గమనార్హం. ప్రభాస్ తాజా చిత్రం ” ఆది పురుష్ ” టిజర్ ను బర్త్ డే కానుకగా విడుదల చేయగా ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. టీజర్ పై తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికి రిలీజ్ అయిన 18 నిముషాలలోనే రెండు లక్షల లైక్స్ ను రాబట్టి యూట్యూబ్ అల్ టైమ్ రికార్డ్స్ లలో నెంబర్ ఒన్ గా నిలిచింది. ఈ రికార్డ్ ను బాలీవుడ్ ఆగ్రహీరోలు అయిన హృతిక్ రోశన్, షారుక్ ఖాన్ కూడా అందుకోలేకపోవడం గమనార్హం. .

ఇటీవల విడుదల అయిన హృతిక్ రోశన్ మూవీ.. ” విక్రమ్ వేద ” టీజర్.. రెండు లక్షల లైక్స్ సంపాధించడానికి గంట పదినిముషాల టైమ్ తీసుకుంది. ఇక దాదాపుగా నాలుగేళ్ల తరువాత బాక్సాఫీస్ వద్దకు వస్తున్న షారుక్ ఖాన్.. తన తాజా చిత్రం ” పఠాన్ ” మూవీ టీజర్ కూడా తాజాగా విడుదల అయింది. ఈ మూవీ టీజర్ రెండు లక్షల లైక్స్ సాదించడానికి 53 నుముషాల టైమ్ తీసుకుంది. దీంతో ప్రభాస్ ” ఆది పురుష్ ” తో కేవలం 18 నిముషాల్లో సెట్ చేసిన రికార్డ్ దరిదాపుల్లో కూడా బాలీవుడ్ ఆగ్రహీరోలు లేకపోవడం చూస్తుంటే.. హిందీ ఆడియన్స్ లో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ప్రభాస్ తన రాబోయే సినిమాలతో బాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి
త్రివిక్రమ్ కు మహేశ్ షాక్ ఇస్తున్నాడా ?
అల్లు అర్జున్ రాంపేజ్.. గెట్ రెడీ ?
ఎన్టీఆర్ షార్ట్ విప్పితే.. బొమ్మ బ్లాక్ బస్టరే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -