Monday, April 29, 2024
- Advertisement -

పుష్ప రాజ్ సౌండ్ ఈసారి మామూలుగా ఉండదట ?

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గానే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా మార్చిన మూవీ ” పుష్ప ” గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అక్కడి స్టార్ హీరోలను సైతం తలదాన్నెలా ఈ మూవీ కలెక్షన్స్ రావడంతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. దాంతో ఈ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ” పుష్ప పార్ట్ 2 ” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్ భారీ విజయం సొంతం చేసుకోవడంతో రెండవ పార్ట్ పై మరింత కసరత్తు చేస్తున్నాడట దర్శకుడు సుకుమార్.

అందుకే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళేందుకు ఆలస్యం అవుతున్నట్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. ఇక ఇప్పటికే కథకు సంబంధింకిన అన్నీ పనులు పూర్తి కావడంతో అల్లు అర్జున్ కు లుక్ టెస్ట్ కూడా ఇటీవల నిర్వహించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ చివరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. మొదటి షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నారట చిత్రాయునిట్. ఇక షూటింగ్ కు వెళ్ళే ముందు ఫ్యాన్స్ ను సర్ఫ్రైజ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పుష్ప మూవీతో అల్లు అర్జున్ కెరియర్ ని మలుపు తిప్పిన సుకుమార్.. పుష్ప పార్ట్ 2 తో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి
ఎన్టీఆర్ షార్ట్ విప్పితే.. బొమ్మ బ్లాక్ బస్టరే !
రాంచరణ్.. వాట్ నెక్స్ట్ ?
మహేశ్ పవన్ మద్య బిగ్ ఫైట్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -