Friday, April 26, 2024
- Advertisement -

‘తమిళ’ బాట పట్టిన బోయపాటి?

- Advertisement -

మాస్​ చిత్రాలు తెరకెక్కించడంలో బోయపాటి శ్రీనుది ప్రత్యేక శైలి. ఇక హీరోలకు ఎలివేషన్స్​ క్రియేట్​ చేయడం.. భారీ ఫైట్​లు చిత్రీకరించడం కూడా బోయపాటిది అందెవేసిన చేయి. బోయపాటి గత చిత్రాలు పెద్దగా సక్సెస్​ కాలేదు. రామ్​ చరణ్​తో చేసిన వినయవిధేయ రామ, బెల్లం కొండ శ్రీనివాస్ తో చేసిన జయ జానకీ రామ ఆశించిన స్థాయిలో సక్సెస్​ కాలేదు. ప్రస్తుతం బాలయ్యతో బోయపాటి అఖండ మూవీ చేస్తున్నాడు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్​లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్​ భారీ హిట్​ అయ్యాయి. దీంతో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న అఖండపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దిల్ రాజు కాంబినేషన్ లో సూర్య హీరోగా ఓ సినిమా ఉంటుందని ఇటీవల వార్తలు వచ్చాయి. సూర్యతో బోయపాటి మాస్ సినిమా చేయనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో నే బోయపాటి దర్శకత్వంలో తమిళ హీరో విశాల్​తో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

Also Read: వరుణ్​తేజ్​ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా..!

ఇప్పటికే విశాల్​కు కథ వినిపించాడట బోయపాటి. ఆ కథ విశాల్ కి నచ్చడంతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. విశాల్​ కూడా తమిళంలో మాస్​ హీరో. అతడికి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు వచ్చే చాన్స్​ ఉంది. విశాల్​కు ఇటీవల తెలుగులో పెద్దగా హిట్స్​ లేవు. దీంతో బోయపాటి సినిమా అయినా సక్సెస్​ అవుతుందేమో వేచి చూడాలి. ప్రస్తుతం దర్శకుడు బోయపాటికి, హీరో విశాల్​కు హిట్స్​ అవసరమే.

Also Read: ట్విట్టర్​లో సౌత్ లోనే నంబర్​ 1 ప్లేస్ కి స్టార్ హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -