Tuesday, April 23, 2024
- Advertisement -

కార్తీని.. హీరో విజయ్​ గుర్తుపట్టలేదట..! ఎక్కడంటే?

- Advertisement -

తమిళ హీరో సూర్య సోదరుడు కార్తీ.. తొలి నుంచి విభిన్న చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసే సినిమాలు ఒక సినిమాతో మరో సినిమాకు పొంతన ఉండదు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. తన తొలి సినిమా పరుత్తి వీరన్ సినిమాతోనే కార్తీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. యుగానికి ఒక్కడు, నాపేరు శివ, చెలియా, కాష్మోరా, చిన బాబు, ఖాకీ, ఖైదీ, సుల్తాన్ ఇలా కార్తీ సినిమాలు ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకంగా ఉంటాయి.

ఆవారా సినిమాతో తెలుగులో కూడా కార్తీ ఇమేజ్ సంపాదించుకున్నారు. లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం తెలుగులోనూ సూపర్​ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే కార్తీ ప్రస్తుతం నెల్సన్​ కుమార్​ దర్శకత్వంలో సర్దార్​ అనే సినిమాలో నటిస్తున్నాడు. చెన్నైలోని ఓ స్టూడియోలో ఈ సినిమా కోసం రూ. కోట్లతో భారీ సెట్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక ఈ పక్కన విజయ్​ నటిస్తున్న బీస్ట్​ షూటింగ్ నడుస్తోంది. సర్దార్​ సినిమాలోని గెటప్​తో .. విజయ్​ను కలిసేందుకు వెళ్లాడు కార్తీ.

Also Read: వరుణ్​తేజ్​ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా..!

కానీ సెట్స్ లో ఉన్న వారు కార్తీ అటు ఇటు తిరుగుతున్నా ఎవరూ గుర్తించలేదు. కార్తీ నేరుగా విజయ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్న వెంటనే విజయ్ గుర్తించలేకపోయాడట చాలా సేపటి వరకు అతడిని విజయ్​ పోల్చుకోలేకపోయాడట. ఆ గెటప్​లో కార్తీని చూసి విజయ్​ చాలా ఆశ్చర్యపోయాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్​ సోషల్​ మీడియాలో వైరల్​ గా మారాయి.

Also Read: అన్నా మీ నంబర్​ ఇవ్వండి.. తేజ్​ ఫన్నీ ఆన్సర్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -