Friday, May 17, 2024
- Advertisement -

చిరు 151 కోసం బోయపాటి ఓకే ? పవన్ కళ్యాణ్ సినిమా మరి ?

- Advertisement -

చిరంజీవి 151వ సినిమా దాదాపుగా బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలోనే ఉంటుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. రెండు మూడు రోజులుగా చోటు చేసుకొంటున్న ప‌రిణామాల్నిబ‌ట్టి ఆ విష‌యాన్ని ఖ‌రారు చేస్తున్నాయి. బోయ‌పాటి శ్రీను చెప్పిన క‌థ చిరంజీవికి బాగా న‌చ్చింద‌ట‌. దీంతో చిరుతో చిత్రాన్ని నిర్మించాల‌నుకొంటున్న అల్లు అర‌వింద్ బోయ‌పాటికి అడ్వాన్సు కూడా ఇచ్చేశార‌ట‌.

అదే స‌మ‌యంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాకి బోయ‌పాటి నో చెప్పార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న సంస్థ‌లో ప‌వ‌న్‌తో ఓ సినిమా చేయాల‌నుకొంటున్నాడు. అందుకోసం త‌న శిష్యుల‌తో ఓ క‌థ కూడా త‌యారు చేయించిన‌ట్టు తెలిసింది. ఆ క‌థ‌ని బోయ‌పాటి తెర‌కెక్కిస్తే బాగుంటుంద‌ని దాస‌రి భావించి ఆయ‌న‌కి క‌బురు పెట్టాడ‌ట‌.

అయితే ప‌వ‌న్‌కి త‌గ్గ క‌థ ఒక‌టి నా ద‌గ్గ‌రే ఉంద‌ని, అదైతే చేస్తాన‌ని బోయ‌పాటి చెప్పార‌ట‌. పైగా త‌న‌కి చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం రావొచ్చంటూ, ప‌వ‌న్ చిత్రానికి నో చెప్పి వ‌చ్చాడ‌ట‌. చిరంజీవి గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతోనే బోయ‌పాటి ప‌వ‌న్ చిత్రానికి నో చెప్పాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. చిరు ప్ర‌స్తుతం చేస్తున్న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 పూర్త‌య్యాకే 151వ సినిమాపై ఓ స్ప‌ష్టత రావొచ్చు.

Related

  1. పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం ఆసక్తిగా చూసిన చిరంజీవి
  2. చిరంజీవి కోసం సాయి ధరం తేజ త్యాగం
  3. తరుణ్ అరోరాతో చిరంజీవి ఫైటింగ్!
  4. కాజల్ అగర్వాల్ ని ఒద్దు అంటున్న చిరంజీవి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -