తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగులో అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. బన్నీకి కథ కూడా నచ్చిందని ఆ మధ్య మాట్లాడుకొన్నారు ఫిల్మ్‌నగర్ జనాలు. అయితే ఏమైందో ఏంటో కానీ… బన్నీని వదిలిపెట్టి ఈమధ్యే లింగుస్వామి ఎన్టీఆర్‌కి కథ వినిపించాడు.
తారక్, లింగుస్వామి కాంబినేషన్‌లో సినిమానే ఓకే కావొచ్చని ప్రచారం సాగింది. అయితే ఇంతలో లింగుస్వామి సినిమాల్లోని ట్విస్ట్‌ని మించిపోయేలా మరో మలుపు చోటు చేసుకొంది. అదేంటంటే లింగుస్వామి మళ్లీ బన్నీ దగ్గరికొచ్చాడు.
త్వరలోనే గీతా ఆర్ట్స్ సంస్థ బన్నీ, లింగుస్వామిల కాంబోలో సినిమాని ప్రకటించబోతోందట. మరింతకీ ఎన్టీఆర్‌ని వదిలి లింగుస్వామి బన్నీ దగ్గరికి ఎందుకొచ్చినట్టు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్‌కి కథ నచ్చలేదా లేదంటే బన్నీతో ముందుగానే కమిట్ అయిపోయి, తర్వాతెప్పుడో తీసే సినిమా కోసమే ఎన్టీఆర్‌కి కథ చెప్పొచ్చాడా అనే విషయాలపై స్పష్టత రావల్సి వుంది.
Related
