Friday, April 19, 2024
- Advertisement -

తరుణ్ అరోరాతో చిరంజీవి ఫైటింగ్!

- Advertisement -

చిరు తన 150వ సినిమా మొదలైనప్పటి దగ్గర నుంచి ఏదో ఒక వార్త బయటకు వస్తునే ఉంది. ఇటివలే ఈ చిత్రంలో హీరోయిన్ కోసం కాజ‌ల్‌ను అడిగారు. రెమ్యున‌రేషన్ ఎక్కవ డిమాండ్ చేయడంతో కాజ‌ల్‌ను పక్కన పెట్టేశారు. ఇక ఈ చిత్రం టైటిల్ ‘క‌త్తిలాంటోడు’ అని ఆ తర్వాత ‘ఖైదీ నెంబరు 150’ అని ర‌క‌ర‌కాల వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

కానీ వీటిలో ఏది కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్, హీరోయిన్ ఎవరు అన్న విషయాల్లో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ చిత్రంలో నటించబోయే విలన్ గురించి ఫిల్మ్ నగర్ లో రకరకాల వార్తలు వస్తున్నాయి. ముందుగా తమిల్ “కత్తి”లో విలన్ పాత్ర చేసిన నీలి నితిన్ ముఖేష్ విలన్ గా చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి.

తరువాత బాలీవుద్ హీరో వివేక్ ఒబరాయ్ పేరు వినిపించింది.. తాజాగా మరో బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా ని విలన్ గా తీసుకున్నారని టాక్. ఇంతకీ ఈ తరుణ్ అరోరా ఎవరంటే చిరంజీవితో “చూడాలని ఉంది” సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలీ జవేరి భర్త పాత్ర‌లో న‌టించిన‌త‌నే ఈ మూవీలో విల‌న్ పాత్ర చేస్తాడ‌ని టాక్‌. అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 

Related

  1. చిరంజీవి ని కలవాలంటే ఇలా చేయండి!
  2. చిరంజీవికి షాక్ ఇచ్చిన విజయశాంతి
  3. చిరంజీవిని నిజంగానే కొట్టిందట
  4. చిరంజీవి ని చూసి నవ్వుతారు ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -