Friday, May 3, 2024
- Advertisement -

బాహుబలి 2 చూసిన చిరు.. ఏమన్నారో తెలుసా…?

- Advertisement -
Meagstar Chiranjeevi Shocking Comments On Bahubali 2

బాహుబలి ది కంక్లూజన్ ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగొడు కాలర్ ఎగరేసేలా ఈ సినిమాని తీసాడు రాజమౌళి. అయితే ఈ సినిమా పై పలు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమాకోసం పడ్డ శ్రమను ప్రతి ఒక్కరు గుర్తించి బాహుబలి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.  

మొదటి రోజు వసూళ్లలో ఈ సినిమా భారతదేశ సినీ చరిత్రలోనే రికార్డులు సృష్టించాయి, ఇప్పటికే తెలుగు సినీ ప్రముఖుల్లో చాలా మంది రాజమౌళితోపాటు బాహుబలి టీం మొత్తాన్ని అభినందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా బాహుబలి 2 సినిమాపై స్పందించారు. చిరంజీవి పేరిట కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ మెసేజ్ ట్వీట్ చేసింది. బాహుబలి ది కన్ క్లూజన్ అసాధారణ సినిమా.

బాహుబలి లాంటి అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళిని ప్రశంసించకుండా ఉండలేం. తెలుగు చిత్ర స్థాయిని పెంచిన ఈ సృష్టికర్తకు హ్యాట్స్ ఆఫ్. ప్రభాష్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ తో పాటు సినిమాకు పని చేసిన అందరికీ అభినందనలు. ప్రదానంగా రచయిత విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తో ఇతర టెక్నికల్ టీం కి ప్రత్యేక అభినందనలు అని మెగాస్టార్ చిరంజీవి ప్రశంచించారు. 

{youtube}CllzwzJfvhQ{/youtube}

Related

  1. రజనీకాంత్, శంకర్ బాహుబలి 2 అందుకుంటారా..?
  2. బాహుబలి 2 లో ప్రేక్షకులకు నచ్చని అంశాలు ఇవే
  3. బాహుబలి 2 మూవీలో లోపం ఏంటో తెలుసా..?
  4. బాహుబలి 2 ఫస్ట్ డే వసూళ్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -